Custard Apple Health Benefits: మధుమేహం ఉన్నవారు సీతాఫలాలు తినొచ్చా?

చలికాలంలో ఎక్కువగా మనకు దొరికే ఫలం..సీతాఫలం. మార్కెట్‌లోకి ఈ పండ్లు ఎప్పుడొస్తాయా అంటూ ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. చిన్నారుల దగ్గరి నుంచి పెద్దవారి వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లు తింటే షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

Custard Apple Health Benefits: మధుమేహం ఉన్నవారు సీతాఫలాలు తినొచ్చా?
New Update

Custard Apple Health Benefits: ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది షుగర్‌ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్నారులకు సైతం షుగర్‌ వస్తోంది. ఉరుకులు పరుగుల జీవితం, ఆహారం అలవాట్ల కారణంగా మధుమేహం వస్తోందని వైద్యులు అంటున్నారు. షుగర్‌ ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. షుగర్‌ ఉంటే సీతాఫలం తినొద్దని కొందరి అభిప్రాయం. వైద్యులు మాత్రం మధుమేహం ఉన్నా సీతాఫలాన్ని నిర్భయంగా తినవచ్చని అంటున్నారు. ఈ పండ్లను తిన్నా మన రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగవని భరోసా ఇస్తున్నారు. ఎక్కువగా సీజన్‌లోనే దొరుకుతాయి కాబట్టి వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. విటమిన్‌ బి-6, కాల్షియం ఎక్కువశాతంలో ఉంటుంది. అయితే షుగర్‌ ఉన్నవారు ఈ సీతాఫలం తినొద్దని అంటుంటారు. నిపుణులు ఏం చెబుతున్నారు..ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి:  చలికాలంలో గుడ్లను ఇలా తింటే బెస్ట్‌.. లేదంటే కష్టమే..!!

ఈ ఫలంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 54 శాతమే ఉంటుంద. దీనిలోని పీచు గ్లూకోజ్‌ను మన రక్తంలో నెమ్మదిగా కలిసిపోతుందని అంటున్నారు. కాకపోతే షుగర్‌ ఉన్నవారు కొద్దిగా మాత్రమే ఈ పండ్లను తీసుకోవాలి. ఈ ఫలాలు ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి, గుండెకి మేలు చేస్తాయని అంటున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థంతో పాటు ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-సి, ఎ ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం పోగొడుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. దీనిలోని నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని అంటున్నారు. సీతాఫలాల్లో పాలీ ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్‌ను బాగా పెంచుతాయి.

మూత్ర సంబంధిత సమస్యలు చెక్

దీని వల్ల షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. 100 గ్రాముల పండులో 20 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది, ఇది ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. ఈ కాయలోని మెగ్నీషియం, పొటాషియం ఇన్సులిన్ ఉత్పత్తిని పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ బాగా తగ్గుతాయి. సీతాఫలంలో బులటాసిన్‌, అసిమిసిన్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. ఈ ఫలంలోని ఎసిటోజెనిన్‌లు మూత్ర సంబంధిత సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా సీతాఫలాలు ఎములను బలంగా చేస్తాయి. పచ్చి కాయలతో గడ్డలు కూడా తగ్గుతాయని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #melons
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe