Beer: బీర్ హెల్త్ కు మంచిదే.. తప్పక తెలుసుకోండి!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ప్రతి మద్యం బాటిల్‌పై ఇది రాసి ఉంటుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా మందుబాబులు మత్తులో మునిగిపోతుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే.. బీర్ తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి.అవేంటో చూసేయండి!

Beer: బీర్ హెల్త్ కు మంచిదే.. తప్పక తెలుసుకోండి!
New Update

వేసవి కాలం వచ్చేసింది. మండుతున్న ఎండల్లో చాలా మంది బీర్ తాగుతూ చిల్ అవుతుంటారు. సీసాలకు సీసాలు లాగిస్తుంటారు. అందుకే ఎండాకాలంలో బీర్ల వినియోగం బాగా పెరుగుతుంది. ఈసారి కూడా బీర్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఇతర మద్యంతో పాటు పోల్చితే.. రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి.విస్కీ, రమ్, జిన్ వంటి వాటి కన్నా.. బీర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. అలాగని ఎంతంటే అంత తాగకూడదు. దాని వల్ల మొదటికే మోసం వస్తుంది. బీర్‌ను మితంగా తాగితే.. ఆరోగ్యానికి మంచి జరుగుతుందట. అవేంటో చూద్దాం.

బీర్ తాగడం వల్ల కూడా డయాబెటిస్ ముప్పు కూడా తగ్గుందనే వాదనలు ఉన్నాయి. వాస్తవానికి బీర్ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని 25 శాతం తగ్గిస్తుంది. ఐతే మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తాగాలి.క్రమం తప్పకుండా బీర్ తాగితే… అల్జీమర్స్ ప్రమాదం 23% తగ్గుతుంది. ఎందుకంటే బీర్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనివల్ల మెదడులో రక్తప్రసరణ మెరుగ్గా జరిగి.. మెదడులో జీవక్రియలు మెరుగ్గా ఉంటాయి. తద్వారా మతిమరుపు వంటి సమస్యలు రావు.

రాత్రిపూట నిద్రపోకపోతే నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఈ సమస్యకు బీరు బాగా పనిచేస్తుంది. తిన్న తర్వాత ఒక గ్లాస్ బీర్ తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఎందుకంటే బీర్ మెదడులో డోపామైన్ ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.మీరు చాలా కాలంగా చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే.. ఆ సమస్యకు బీర్ అద్భుతంగా పనిచేస్తుంది. బీర్‌లో ఉండే ఈస్ట్, విటమిన్-బి వల్ల చుండ్రు తొలగిపోతుంది. బీరుతో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల వెంట్రుకలు దృఢంగా మారుతాయి. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

#health #beer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe