పండుగలు వచ్చాయంటే వ్యాపారాలు బాగా జరుగుతాయని వ్యాపారులు ఆలోచిస్తారు. పండుగల సీజన్ నవంబర్ 22 తో పూర్తి అవ్వగా..ఆ మరుసటి రోజు నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది పెద్దగా ముహుర్తాలు లేకపోవడం వల్ల ఈసారి సీజన్ లో భారీగా వివాహలు జరుగుతున్నాయి. సుమారు 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.
ఇప్పుడు జరిగే పెళ్లిళ్ల వల్ల వ్యాపారవేత్తలకు మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు భారీగా ముహుర్తాలు ఉన్నాయి. పెళ్లి అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం.
Also read: ఎన్నికలు సమీపిస్తుండటంతో సూళ్లూరుపేట వైసీపిలో వర్గ పోరు పురుడు పోసుకుంటుందా.. ?
ప్రస్తుతం రోజుల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు , వారి తల్లిదండ్రులు ఎవరూ కూడా ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవసరం అయితే అప్పులు చేసి అయినా పెళ్లి చేస్తున్నారు. ఈ సీజన్ లో పెళ్లి షాపింగ్ లే కానీ, వివాహం లో అవసరం అయ్యే వస్తువులే కానీ మొత్తంగా కొన్ని లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఒక పెళ్లి మీద జరిగే షాపింగ్, నిత్యావసరాల ఖర్చు మాత్రమే రూ. 4.25 లక్షలుగా ఉంటుందని అంచనా.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ డేటాను విడుదల చేసింది. కేవలం దేశ రాజధాని నగరంలోనే సుమారు 3.5 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశాలున్నట్లు అంచనా. ఢిల్లీలో కొన్ని కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలున్నట్లు నిపుణులు, ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
Also read: దసరా స్పెషల్.. సికింద్రాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!
పోయిన ఏడాది ఇదే సమయంలో సుమారు 32 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. వాటి కోసం రూ. 3.75 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. ఒక సాధారణ పెళ్లిలో సుమారు 3 లక్షలు ఖర్చు అవుతుంది. కొంచెం గ్రాండ్ గా చేసుకోవాలి అనుకునే వారి పెళ్లిళ్లలో సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా కొంచెం గ్రాండ్ గా చేసుకోవాలి అనుకునే వారికి 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మరి కొన్ని పెళ్లిళ్లలో 25 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఇదంతా ఇలా ఉండగా మరి కొన్ని పెళ్లిళ్లు అయితే సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కొన్ని పెళ్లిళ్లు అయితే కోటి లేక అంతకంటే ఎక్కువ కూడా ఖర్చు చేస్తున్నట్లు నిపుణులు, ఆర్థిక వేత్తలు తెలిపారు. కేవలం నెల రోజుల్లోనే సుమారు రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టేట్లు కనిపిస్తుంది.
కేవలం పెళ్లి షాపింగ్ వరకు మాత్రమే అంత అయితే..అవి కాకుండా ఇంటికి సంబంధించిన కొన్ని పనులు, వస్తువులు, బట్టలు, పూజా, కిరాణా సామాగ్రి వంటి వాటికి కూడా ఖర్చు చేస్తుంటారు. ఇవి కాకుండా పెళ్లికి సంబంధించి పువ్వులు, షామియానా, క్యాటరింగ్ వీటిని అన్నింటిని వేసుకుంటే మరిన్ని డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. దీనితో పాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా పుంజుకుంటుంది.