Pakistan Cable Car : తెగిన కేబుల్ వైర్..గాల్లో ప్రాణాలు..!! పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 900అడుగుల ఎత్తులో కేబుల్ కారు వైర్ తెగిపోయింది. ఈకారులో పాఠశాల పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఒకవైర్ మాత్రమే తెగింది. ఒక వైర్ తో మీదే దాదాపు 16గంటల పాటు ఆ చిన్నారులు నరకయాతన అనుభవించారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. By Bhoomi 28 Aug 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pakistan Cable Car : పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. 900 అడుగుల ఎత్తులో కేబుల్ కారు వైర్ తెగిపోయింది. ఈ కారులో ఉన్నవారంతా పాఠశాల చిన్నారులే. అదృష్టవశాత్తు ఒకవైర్ మాత్రమే తెగింది. ఒక వైర్ మీదనే దాదాపు 16 గంటల పాటు నరకయాతన అనుభవించారు ఆ చిన్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఈ ఘటన ఉత్తర పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పర్వత బట్టాగ్రామ్ జిల్లాలో జరిగింది. పాఠశాలకు వెళ్లేందుకు వారు ఉపయోగిస్తుంటారు. రోజులాగే కేబుల్ కారులో పాఠశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక వైరు తెగిపోయింది. దాదాపు 16గంటల తర్వాత సైనిక కమాండోలు సాహసోపేతమైన రెస్క్యూ మిషన్‌లో వారిని రక్షించారు. ఇది కూడా చదవండి: ఇది సబ్ వే కాదు.. రెజ్లింగ్ రింగ్ అంతకన్నా కాదు.. ఇదేం తన్నుకోవడం బాబోయ్..!! Extraordinary drone footage shows the cable car dangling dangerously in mid-air in PakistanRead more: https://t.co/727JpuoJaV pic.twitter.com/DOLNZ4Vw1l— Sky News (@SkyNews) August 23, 2023 రెస్య్కూ టీం వెళ్తున్న వాహనం లోయలో చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు ఎక్కువ సమయం పట్టింది. మేము అకస్మాత్తుగా ఒక కుదుపును అనుభవించాము. ఇదంతా చాలా అకస్మాత్తుగా జరిగింది, మనమందరం చనిపోతామని మేము అనుకున్నాము" అని ఒసామా షరీఫ్ చెప్పాడు. తాము 15 వ తరగతి పరీక్ష ఫలితాలను పొందడానికి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు వెల్లడించాడు. ఇది కూడా చదవండి: రాహుల్ ది ఆల్‌రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా…!! #rescue-operation #pakistan-cable-car మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి