• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » Byreddy Siddharth Reddy: ఆ నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు

Byreddy Siddharth Reddy: ఆ నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు

Published on July 21, 2023 6:00 pm by BalaMurali Krishna

ఆ నియోజకవర్గంలో నేతల మధ్య వర్గపోరు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్‌చార్జ్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఎమ్మెల్యే టికేట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుండటంతో వైసీపీ అధిష్టానం తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

Translate this News:

కలిసికట్టుగా విజయతీరం..

2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు(Nandikotkuru)ను ఎస్సీ రిజర్వుడుగా ప్రకటించారు. అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లబ్బి వెంకటస్వామి నందికొట్కూరు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఐజయ్య , 2019లో జరిగిన ఎన్నికల్లో ఆర్థర్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. తొలి నుంచి వైయస్ ఫ్యామిలీకి ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.అయితే ఇటీవల నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. 2019 ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddharth Reddy), ఎమ్మెల్యే ఆర్థర్(MLA ARTHUR) కలిసికట్టుగా పనిచేసి విజయతీరం చేర్చారు.

ఆధిపత్య పోరుతో సతమతం..

అయితే గెలిచిన ఆరు నెలలకే ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. దీంతో ఇద్దరు నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు.ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్(MLA ARTHUR) ఏ కార్యక్రమం చేపట్టినా స్వపక్షం నుంచే వ్యతిరేకత ఎదురైంది. గడప గడపకు కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి(Byreddy Siddharth Reddy) ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మంత్రి రోజా నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటిస్తే స్థానిక ఎమ్మెల్యేకు కనీసం సమాచారం ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాగతం బ్యానర్లలో కూడా ఆర్థర్ ఫోటో లేకుండా చేశారని ఎమ్మెల్యే వర్గీలయు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఎలా పాల్గొంటారని మండిపడుతూ ధర్నాకు కూడా దిగారు.

టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.ఇంతలా నందికొట్కూరు నియోజకవర్గంలో వర్గపోరు ఉన్నా అధిష్టానం ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆవేదన క్యాడర్‌లో ఏర్పడింది. మరోవైపు ఎమ్మెల్యే టికెట్‌ను తన వర్గానికి చెందిన వారికి టికెట్ ఇప్పించుకునేందుకు సిద్ధార్థ్ గట్టి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కూడా తనకే టికెట్ వచ్చేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరే కాకుండా మాజీ ఎమ్మెల్యే లబ్ధి వెంకటస్వామి, మరో మాజీ ఎమ్మెల్యే ఐజయ్య తనయుడు చంద్రమౌళి కూడా టికిట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ ఎవరు చేస్తారో? అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

 

Primary Sidebar

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Donald Trump

Donald Trump: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

ind vs aus third match

 ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే…టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online