By Polls In 13 Assembly Seats : దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు (By Elections) జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ (EC) షెడ్యూల్ రిలీజ్ చేసింది. 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జులై 10న పోలింగ్, జులై 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారని తెలిపింది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ (Polling) జరగనుందో తెలుసుకుందాం..
Also Read: అమరావతి ఇప్పుడెలా ఉంది? నిర్మాణాలు పనికి వస్తాయా?
ఉపఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఇవే..
పశ్చిమ బెంగాల్ లోని రాయ్ గంజ్, రణఘాట్ సౌత్, బాగ్దా, మాణిక్తలా - 4
హిమాచల్ ప్రదేశ్ లోని డెహ్రా, హమీర్పూర్, నలగర్ - 3
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, మంగళూరు - 2
బీహార్ - రూపాలి నియోజకవర్గం - 1
తమిళనాడులోని విక్రవాండి - 1
మధ్యప్రదేశ్ లోని అమరవాడ 1
పంజాబ్ లో జలంధర్ వెస్ట్ - 1
ఈ ఉప ఎన్నికలకు జూన్ 14 నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. నామినేషన్ దాఖలుకు జూన్ 21 చివరి తేదీ. జూన్ 24 వరకు నామినేషన్ పరిశీలన, ఉపసంహరణకు జూన్ 26 వరకు చివరి తేదీ ఉంటుందని ఈసీ వెల్లడించింది.