Earthen Pot: వేసవిలో చల్లని నీరు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. చాలా మంది ఫ్రిజ్‌లోని నీటిని తాగుతారు. అయితే మట్టి కుండలో నీరు తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. మట్టి కుండ నీటిని సహజంగా చల్లబరుస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఫ్రిజ్ వాటర్‌తో పోలిస్తే కుండలో నీరు తాగడం వల్ల తాజాదనం ఇస్తుంది. సరైన కుండను ఎంచుకోకపోతే అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. మట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
నాణ్యత పరిశీలించాలి:
మట్టి కుండను కొనుగోలు చేసినప్పుడు ముందుగా అది మంచి మట్టితో తయారు చేశారో లేదో చూడాలి. చెడ్డ మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి మంచిది కాదని, అందులో చెడు బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కుండ శుభ్రత:
మట్టి పాత్రను కొనుగోలు చేసేటప్పుడు దాని లోపల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతర్గత, ఉపరితలం ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సరిగాలేకపోతే దానిని శుభ్రం చేయడం చాలా కష్టం. అలాంటి సమయంలో బ్యాక్టీరియా, క్రిములు అక్కడ సులభంగా వృద్ధి చెందుతాయి. నీరు కూడా కలుషితం అవుతుంది. అందుకే కొనుగోలు చేసేప్పుడు ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కొనేముందు నీటితో నింపి లీకులు ఉన్నాయో లేదో చూసుకోవాలి, అందులో నీరు రంగు మారుతుందో లేదో పరిశీలించాలి. అలాగే మూత తీసుకునేప్పుడు కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. గ్యాప్స్ ఉంటే క్రిములు నీటిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఫిట్‌గా ఉండే మూతను తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: యాలకులతో ఇలా చేశారంటే ముఖంపై మచ్చలు మాయం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.