diwali: దీపావళి రోజున కొత్త చీపురుతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు! దీపావళి నాడు కొత్త చీపురు కొంటే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటామని చాలా మంది నమ్మకం. చీపురును నిత్యం ఇంట్లో లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. By Bhavana 11 Nov 2023 in లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి చీకటిని తరిమికొడుతూ..వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటుటాం. పండుగ నాడు దీపాలు వెలిగించడంతో పాటు లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తే సిరిసంపదలు కలిసొస్తాయని నమ్మకం. అలాగే మరో నమ్మకం కూడా ప్రజల్లో ఉండిపోయింది. అది ఏంటంటే దీపావళి నాడు కొత్త చీపురు కొనడం. పండుగ నాడు కొత్త చీపురు కొంటే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటామని చాలా మంది నమ్మకం. చీపురును నిత్యం ఇంట్లో లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. ఇంటికి చీపురుని కొని తీసుకుని వస్తే కనుక ముందు దానికి పూజ చేసిన తరువాతే ఆ మరుసటి రోజు నుంచి ఇంట్లో ఉపయోగిస్తారు. ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుంది. కాబట్టి పండుగ నాడు లక్ష్మి శాశ్వతంగా నివసించే చీపురును ఆలయంలో శుభ ముహుర్తంలో దానం చేయాలని చెబుతారు. దీపావళి మాత్రమే కాకుండా ఏ రోజైనా చీపురు కొనుక్కోవచ్చు. కానీ శనివారం చీపురు కొనకూడదని చెబుతారు. ఇదిలా ఉంటే చీపురు గురించి పండితులు మరిన్ని విషయాలను తెలియజేస్తున్నారు. చీపురును బహిరంగ ప్రదేశంలో పెట్టకూడదు..అలా చేయడం అశుభం అని పెద్దలు వివరిస్తున్నారు. ప్రధాన ద్వారం నుంచి చీపురును ఎవరూ చూడకుండా పెట్టుకోవాలని పండితులు వివరిస్తున్నారు. పరిసరాల్లో ఉపయోగించని చీపురు కళ్ల ముందు ఉంచుకోకూడదు. చీపురును ఎక్కువగా ఉత్తరం వైపు ఉంచాలని పెద్దలు అంటున్నారు. చీపురును పడక గదిలో ఉంచినట్లయితే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే చీపురును తన్నడం, దానితో ఎవరినైనా కొట్టడం , విసిరి కొట్టడం అస్సలు చేయకూడదు. దీపావళి చీపురు కొంటే సిరిసంపదలు పెరుగుతాయి. అలాగే చీపురును దానం చేసినా కూడా చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు. అలాగే దీపావళి నాడు 3 కొత్త చీపుర్లు కొని మూడు వేరువేరు దేవాలయాలకు ఇవ్వాలి . వాటిలో ప్రధానంగా శివాలయం ఉండేటట్లు చూసుకోవాలి. రెండవది దుర్గ గుడి, మూడు లక్ష్మీదేవి గుడి అయి ఉండాలి. చీపుర్లు దేవాలయాలకు ఇచ్చేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. ఇలా చేయడం వల్ల కోటీశ్వరులు అవుతారని కొందరు పండితులు వివరిస్తున్నారు. ఇలా దానం చేసిన చీపురుతో ఆలయాన్ని శుభ్రం చేయడం వల్ల మంచి జరుగుతుందని విశ్వాసం. దాంతో పాటు కష్టాలన్ని కూడా తొలగిపోతాయని పండితులు తెలుపుతున్నారు. Also read: దీపావళి పండుగ వేళ ఉచితంగా మద్యం, పటాకులు..ఎక్కడో తెలుసా! #deepavali #broom మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి