Butchaiah Chowdary: రేపు ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య ప్రమాణస్వీకారం

AP: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాలని బుచ్చయ్యను మంత్రి కోరారు. రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Butchaiah Chowdary: రేపు ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య ప్రమాణస్వీకారం
New Update

Gorantla Butchaiah Chowdary: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్‌గా (Protem Speaker) వ్యవహరించాలని బుచ్చయ్యను మంత్రి కోరారు. రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా ఈ నెల 21 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య.

రెండు రోజుల పాటు..

ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్ లో ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వాస్తవానికి ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజు.. అంటే 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ మరుసటి రోజు 22న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. 

Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు

అయితే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడికి (Ayyannapatrudu) అవకాశం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu Naidu) డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇస్తారని సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రొటెం స్పీకర్ గా మరో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ నెల 22న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారు.

#butchaiah-chowdary #tdp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe