సరికొత్త కలర్ లో టీవీఎస్ బైక్‌ లాంచ్.. కేవలం రూ. 59,880కే..!

టీవీఎస్ కంపెనీ గతంలో రేడియన్ బైక్ ని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో దేశీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా కంపెనీ మరో కొత్త కలర్ వేరియంట్ ను రిలీజ్ చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని తీసుకొచ్చింది. ఇది రూ.59,880 ధరతో లభిస్తుంది.

TVS Radeon All Black Base Edition
New Update

భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. కొత్త కొత్త కంపెనీలు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. వాహన ప్రియుల్ని అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఫీచర్లతో రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా యూత్ ని లక్ష్యంగా చేసుకుని పలు కంపెనీలు బైక్ లను స్టైలిష్ లుక్ లో రిలీజ్ చేస్తున్నాయి. అందులో ప్రముఖ వాహన తయారీదారు టీవీఎస్ ఒకటి. 

TVS Radeon

ఇప్పటికి ఎన్నో మోడళ్లను విడుదల చేసిన కంపెనీ తాజాగా మరొక బైక్ ను పరిచయం చేసింది. అప్డేటెడ్ రేడియన్ ఆల్ బ్లాక్ బేస్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఇదివరకు ఈ బైక్ అందుబాటులోకి వచ్చింది. అద్బుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ బైక్ కు ప్రత్యేక డిమాండ్ కూడా ఉంది. దీని కారణంగానే కంపెనీ మరొక కొత్త కలర్లో దీనిని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బైక్ ను ఆల్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో కొనుక్కోవచ్చు. దీంతో మొత్తం ఏడు కలర్స్ లో ఈ TVS Radeon బైక్ అందుబాటులో ఉంది.  

ఇది కూడా చదవండిః ఉఫ్.. ఉఫ్.. పల్సర్ బైక్‌లపై భారీ డిస్కౌంట్లు, సూపరో సూపర్!

ఇకపోతే ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో బేస్ వేరియంట్ ధరను కంపెనీ తగ్గించింది. తగ్గింపుతో బేస్ వేరియంట్ కేవలం రూ.59,880 (ఎక్స్ షోరూమ్) ధరకే లభిస్తుంది. మిడ్ రేంజ్ డీజీ డ్రమ్ వేరియంట్ రూ.77,394 (ఎక్స్ షోరూమ్) ధరకే లభిస్తుంది. అలాగే టాప్ రేంజ్ డీజీ డిస్క్ వేరియంట్ రూ.81,394 (ఎక్స్ షోరూమ్) ధరకు కొనుక్కోవచ్చు. 

ఇందులో ఎల్సీడీ స్క్రీన్, యూస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి అందించారు. కాగా ఈ బైక్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (cbs)ను కలిగి ఉంది. దీని కారణంగా బైక్ కి సంబంధించిన బ్రేకింగ్ సిస్టమ్స్ బాగా పనిచేస్తాయి. ఇది 109.7 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8 పిఎస్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లీటర్ కు 68 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్స్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లను కంపెనీ అందించింది. దీంతోపాటు మరెన్నో అధునాతన ఫీచర్లు అందించబడ్డాయి. 

#tvs #best-bikes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe