/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
gold
Gold: ప్రస్తుత మార్కెట్ లో బంగారం డిమాండ్ బాగా పెరిగిపోయింది. రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అప్పట్లో ఒక కేజీ బంగారం కొన్నోడు .. ఇప్పుడు కోటీశ్వరుడు అనే రేంజ్ లో పసిడి ధరలు ఉన్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹123,100 ఉంది. దీంతో ఇప్పుడు అందరూ బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాతికేళ్ల క్రితం బంగారం ధరకు.. ఇప్పటికీ దాదాపు 25 రేట్లు పెరిగింది.
2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 4,400 ఉండేది. ఇప్పుడు దాదాపు రూ.123,100కి పెరిగింది. అంటే 25 ఏళ్లలో దాదాపు 25 రెట్లు పెరిగింది. మరి ఇప్పుడు రూ.1 లక్ష పెట్టి 10 గ్రాముల బంగారం కొంటే.. 2050 నాటికి అది ఎంత అవుతుంది అని ఆలోచించారా? అయితే దీనికి ఖచ్చితమైన సమాధానం లేనప్పటికీ గత 25 ఏళ్ళ గణాంకాలను ఆధారంగా అంచనా వేయవచ్చు.
2050 నాటికి ఎంత?
సగటు వృద్ధి 10% అనుకుంటే మీ రూ.1 లక్ష విలువైన బంగారం 2050 నాటికి రూ.11 లక్షల నుంచి ₹12 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. వృద్ధి 8% ఉంటే.. దాని విలువ దాదాపు రూ.7 లక్షల వరకు పెరగొచ్చు. ఒకవేళ వృద్ధి రేటు 12 శాతానికి పెరిగితే .. అప్పుడు మీ పెట్టుబడి ఏకంగా రూ.15 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది! దీంతో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు, బిజినెస్ల కంటే.. బంగారం పై ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నారు ప్రజలు.
బంగారం ధరలు పెరగడానికి కారణాలు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్ధిక అనిశ్చితి.. ముఖ్యంగా అమెరికా, యూరప్ వంటి పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థల బలహీనపడడం, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ పెరగడం బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు! డాలర్ విలువ పెరిగినప్పుడు.. రూపాయి విలువ తగ్గినప్పుడు భారతదేశం విదేశాల నుంచి బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో భారత్ లో బంగారం ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అలాగే పండుగలు, ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో కూడా బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీంతో పెరిగితే ధర ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
Follow Us