ఐఫోన్ 13 సిరీస్ రూ. 11కే అంటూ ఫేక్ ప్రచారం.. మండిపడుతున్న నెటిజన్లు!

ఐఫోన్ 13 సిరీస్ రూ.11 కే అంటూ ఫ్లిప్ కార్ట్ లో యాడ్ రావడంతో.. నెటిజన్లు ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించారు. ఎన్నిసార్లు ట్రై చేసిన స్టాక్ లేదని చూపెట్టడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయవద్దని ఫ్లిప్‌కార్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

iphone 13
New Update

ఇటీవల ఐఫోన్ సిరీస్ 16 మార్కెట్లోకి విడుదలైంది. దీంతో మిగతా సిరీస్‌ల ఫోన్ల రేట్లు తగ్గుతాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు కేవలం రూ.11కే ఆర్డర్ పెట్టకోవచ్చనే ఫ్లిప్‌కార్ట్‌‌లో బ్యానర్లు వచ్చాయి. సెప్టెంబర్ 22న సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ చేస్తే కేవలం రూ.11లకు ఐఫోన్ 13 సిరీస్ మొబైల్ వస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆదివారం రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టడానికి ట్రై చేశారు. కానీ లాభం లేకపోయింది. ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించిన వారికి స్టాక్ లేదని పాప్‌అప్ మెసేజ్‌లు వచ్చాయి. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించిన ఇలానే జరిగిందని నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డారు. 

తప్పుడు ప్రచారాలపై సంస్థ స్పందించాలి

వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలు చేస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఉచితంగా పబ్లిసిటీ చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ఆర్డర్ పెట్టడానికి ప్రయత్నించిన వారందరికీ ఇలానే జరగడంతో సోషల్ మీడియాలో తిరిగి పోస్ట్‌లు పెట్టారు. ఇలా తప్పుడు ప్రచారాలపై సంస్థ స్పందించి.. బాధ్యత తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ను కోరారు. ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి రావడంతో రేట్లు తగ్గుతాయని వచ్చిన వార్తలను చాలామంది నమ్మారు. నమ్మలేని ఇలాంటి ఆఫర్లు వస్తే.. వివరాలు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి తెలుసుకోవాలని మరికొందరు అంటున్నారు.   

 

 

 

 

 

 

 

 

#apple-iphone-13
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe