Stock Market: మళ్ళీ మార్కెట్ ఢమాల్..సూచీలు 24, 200 దిగువకు

వారం చివరి రోజు మార్కెట్ ఢమాల్ అంది. గత కొన్ని వారాలుగా నష్టాల్లో సాగుతున్న మార్కెట్ ఈరోజు మరింత దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌ 663 పాయింట్లు, నిఫ్టీ  219 పాయింట్లు నష్టపోయాయి.

stock
New Update

Stock Market: 

గత కొన్ని రోజులుగా మదుపర్లకు కంటి మీద కునుకు లేదు. దానికి కారణం మార్కెట్ నష్టాల్లో ట్రెండ్ అవుతుండడమే. రోజు మార్కెట్ సూచీలు నేల చూపులే చూస్తున్నాయి. ఈరోజు కూడా సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 900 పాయింట్లు మేర నష్టపోగా.. తర్వాత కాస్త కోలుకుంది. నిఫ్టీ 24,200 దిగువకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 80,187.34  దగ్గర స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కానీ కాసేపటికే నష్టాల బాట పట్టింది.  ఆతరువాత రోజంతా నష్టాల్లోనే కొనసాగించింది. ఇంట్రాడేలో 79,137.98 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 662 పాయింట్ల నష్టంతో 79,402 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.60 పాయింట్ల నష్టంతో 24,180.80 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.09గా ఉంది.

ఇది కూడా చదవండి: Kishan Reddy: దమ్ముంటే కూల్చు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సంచలన సవాల్!

సెన్సెక్స్ స్టాక్స్‌లో  20 క్షీణించగా, 10 పెరిగాయి. 50 నిఫ్టీ స్టాక్స్‌లో 38 క్షీణించగా, 12 పెరిగాయి. ఎఫ్‌ఎంసిజి, హెల్త్‌కేర్ సూచీలు మినహా అన్ని రంగాలు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అత్యధికంగా 2.52 శాతం పడిపోయింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, లార్సెన్ & టూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్‌లో అత్యధికంగా నష్టపోయాయి. ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మార్కెట్‌ను పెంచాయి.

Also Read: తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలో పనులు షురూ!

మార్కెట్ ఈరోజ మరింత నష్టాల్లోకి కుంగిపోవడానికి...బలహీన త్రైమాసిక ఫలితాలని తెలుస్తోంది. పద్ద పెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో ఎలాంటి ఎదుగుదల లేకపోవడం వల్లనే సూచీలు పతనమయ్యాయని అనలిస్టులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌..  లాభంలో 40 శాతం క్షీణత నమోదుచేసింది. ఈరోజు అయితే  ఇంట్రాడేలో ఏకంగా 19 శాతం నష్టపోయింది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు పడడంలో ఈ స్టాక్‌ది కీలక పాత్ర పోషించింది. ఇక దీంతో పాటూ విదేశీ మదుపర్లు కూడా జోరుగా అమ్మకాలు కొనసాగించారు. ఇది కూడా సూచీల మీద ప్రభావం చూపించింది. గత 19 సెషన్లుగా ఎఫ్‌ఐఐలు విక్రయదారులుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా అమ్మకాలు చేస్తున్నారు. మరోఐపు అమెరికా ఎన్నికలు కూడా మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొన్నప్పటికీ.. ట్రంప్‌ వైపు మొగ్గు ఉందన్న అంచనాలు అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ బలపడడానికి కారణమవుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు.

Also Read: పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబ్ ఏంటి? కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అవుతారా?

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe