Stock Market: భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు!

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకింది. ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లాభాలకు కారణంగా చెప్పొచ్చు.

author-image
By Bhavana
దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు, కొత్త రికార్డులు నమోదు
New Update

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతున్నాయి. సెన్సెక్స్​  మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకింది. ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాల్లో నడుస్తున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ సెన్సెక్స్‌ 902 పాయింట్లు వృద్ధిచెంది 83,52 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 259 పాయింట్లు పెరిగి 25,675 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో బాటలో కొనసాగుతున్న స్టాక్స్​ : ఎం అండ్ ఎం, బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్​, జేఎస్​డబ్ల్యూ, టాటా స్టీల్​, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టీసీఎస్​

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe