Forbes Billionaires List 2025: 3లక్షల కోట్లు ఆమె సొంతం.. దేశంలో అత్యంత సంపన్నురాలు ఎవరో తెలుసా..?

2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితా రిలీసైంది. అందులో అత్యంత సంపన్నురాలుగా సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ 35.5 బిలియ‌న్ డాల‌ర్లు అంటే.. రూ.3 లక్షల 34 వేల కోట్లుగా చెప్పుకోవచ్చు. టాప్ 10 ఇండియ‌న్ బిలియ‌నీర్ల జాబితాలో ఆమె 3వ స్థానంలో ఉన్నారు.

New Update
Savitri Jindal

Savitri Jindal Photograph: (Savitri Jindal)

2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్ల జాబితా రిలీజైంది. భార‌తీయ బిలియ‌నీర్ల మొత్తం ఆస్తుల విలువ 941 బిలియ‌న్ల డాల‌ర్లు. గ‌త ఏడాదితో పోలిస్తే ఇది త‌గ్గింది. ఆ లిస్టులో అత్యంత సంప‌న్న భార‌తీయ మ‌హిళ‌గా సావిత్రి జిందాల్ నిలిచారు. అంతేకాదు ఆమె హ‌ర్యానాలో ఎమ్మెల్యేగా కూడా కొన‌సాగుతున్నారు. టాప్ టెన్ ఇండియ‌న్ బిలియ‌నీర్ల జాబితాలో ఆమె మూడ‌వ స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌గా ప్రస్తుతం సావిత్రి జిందాల్ ఉన్నారు. 2025 ఫోర్బ్స్ బిలియ‌నీర్స్ లిస్ట్‌లో ఈమె రిచెస్ట్ ఇండియ‌న్ ఉమెన్‌గా నిలిచారు. ఆమె ఆస్తుల విలువ‌ సుమారు 35.5 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నట్లు ఆ జాబితాలో వెల్లడించారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ త‌ర్వాత ఆ జాబితాలో సావిత్రి మూడ‌వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 భార‌త బిలియ‌నీర్ల‌లో ఉన్న ఏకైక మ‌హిళ ఆమే కావ‌డం విశేషం.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

 35.5 బిలియ‌న్ డాల‌ర్లు అంటే.. మన ఇండియన్ కరెన్సీలో 3లక్షల కోట్ల 34 వేల కోట్లు ఆమె పేరు మీద మొత్తం ఆస్తులు ఉన్నాయి. స్టీల్, ప‌వ‌ర్‌, సిమెట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో జిందాల్ గ్రూపు బిజినెస్ చేస్తోంది. ఆ గ్రూపున‌కు సావిత్రి చైర్మెన్‌గా కొన‌సాగుతున్నారు. ఆమె భ‌ర్త ఓం ప్రకాశ్ జిందాల్ ఆ కంపెనీ స్థాపించారు. 2005లో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న మృతి త‌ర్వాత వ్యాపారాన్ని నాలుగురు కుమారుల‌కు విభ‌జించారు. ముంబైలో స‌జ్జన్ జిందాల్, ఢిల్లీలో నివ‌సించే న‌వీన్ జిందాల్‌, మరో ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Also read: PM Modi: ‘మరో 5 నెలల్లో ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. తర్వాత ఎవరో RSS నిర్ణయం’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు