Cheapest Samsung Smartphone: ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడేవారు ఎక్కువైపోయారు. అందువల్లనే భారతదేశీయ స్మార్మ్‌ఫోన్ మార్కెట్‌లో మొబైళ్లకి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దీంతో కొత్త కొత్త కంపెనీలు సైతం దేశీయ మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో రకరకాల మోడళ్లను రిలీజ్ చేస్తూ అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటున్నాయి. అయితే ఇప్పుడంతా 5జీ మయమైపోవడంతో చాలా మంది సామాన్యులు అతి తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కుందాం అని అనుకున్నా కొనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్‌లో రిలీజ్ అవుతున్న ఫోన్లన్నీ భారీ ధరను కలిగి ఉన్నవే. అందువల్లనే తక్కువ ధరలో ఫోన్‌కోసం చూసే వారికి కష్టంగా మారుతుంది.
అయితే ఇప్పుడు అలాంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఊహించని ధరలోనే ఒక కొత్త 5జీ మొబైల్‌ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది. కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్లు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్‌లో శాంసంగ్ ఫోన్‌ను భారీ ఆఫర్లతో అతి తక్కువ ధరలోనే కొనుక్కోవచ్చు.
Samsung Galaxy A14 5G
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ అసలు ధర రూ.15,499 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ న్యూ సేల్‌లో కేవలం రూ.9,999లకే లిస్ట్ అయింది. అంటే దాదాపు రూ.5,550 తగ్గింపు లిభిస్తుందన్నమాట. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే HDFC క్రెడిట్ కార్డు ట్రాన్సక్షన్‌పై రూ.750 వరకు తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీనిని రూ.9,249లకే కొనుక్కోవచ్చు. అలాగే భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపు రూ.6,800 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.2,449కే సొంతం చేసుకోవచ్చు. ఒకరకంగా ఇది సామాన్యులకు అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి.
Samsung Galaxy A14 5G Specifications
Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. అందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫోన్ ముందు భాగంలో సేల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం 13 మెగా పిక్సెల్ కెమెరాతో వచ్చింది.
అలాగే ఫోన్ సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. ఇక ఫోన్ ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇందులో ఎక్సీనోస్ 1330 ప్రోసెసర్‌ను కలిగి ఉంది. ఇది 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుతుంది. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.