భారతీయ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
నానో కారుతో మధ్య తరగతి కుటుంబాల కారు కలను తీర్చేందుకు ముందుకు వచ్చిన గొప్ప పారిశ్రామిక వేత్త మనముందు లేరనే విషయం కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
రతన్ టాటా పార్సీ కమ్యూనిటీకి చెందిన వారు. అందువల్ల తన కమ్యూనిటీ సంబంధించిన ఆహారాన్నే ఇష్టంగా తినేవారు.
రతన్ టాటాను తన వంటకాలతో ఆకట్టుకున్న మరో వ్యక్తి ప్రముఖ పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్.
తొలుత టీ, స్నాక్స్‌తో ప్రారంభమైన అతని పాక నైపుణ్యం త్వరిగతిలోనే విశేష ప్రజాధరణ పొందింది.
టాటా స్టీల్ వార్షిక ఫంక్షన్లో వంటలు చేసిన ఆయన.. నెమ్మదిగా రతన్ టాటా వ్యక్తిగత చెఫ్‌గా మారాడు.
రతన్ టాటాకు హోమ్‌స్టైల్ పార్సీ వంటకాలంటే మహా ఇష్టమట. ఆయనకి ఖట్టా-మీఠా మసూర్ దాల్ (వెల్లుల్లితో వండిన తీపి పప్పు వంటకం), మటన్ పులావ్ పప్ప, ఐకానిక్ నట్-రిచ్ బేక్డ్ సీతాఫలం చాలా ఇష్టమట.