ప్రముఖ పారిశ్రామిక వేత్త మరణించారనే విషయం తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా విషాదంలో మునిగిపోయింది. రతన్ టాటా మరణంపై ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. అయితే బుధవారం రతన్ టాటా మరణించగా.. నిన్న అధికార లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు. రతన్ టాటా బయోపిక్ తీయాలనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ క్రమంలో రతన్ టాటాపై ఓ డాక్యుమెంటరీ ఉందనే విషయం బయటకు వచ్చింది.
ఇది కూడా చూడండి: 'విశ్వంభర' సెట్స్ లో వెంకీ మామ సందడి.. ఫొటోలు వైరల్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..
నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా రతన్ టాటా డాక్యుమెంటరీ ఎపిసోడ్‌ను చేసింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఆఫ్ ఇండియా మెగా ఐకాన్స్ సీజన్ 2లోని ఎపిసోడ్2లో రతన్ టాటా గెస్ట్‌గా హాజరై తన జీవితంలో ఉన్న విశేషాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇది కూడా చూడండి: Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్!
ఈ డాక్యుమేంటరీలో తక్కువ ధరకే కారు ఎందుకు తీసుకొచ్చారు? ఆ ఆలోచన ఎలా వచ్చిందనే విషయాల గురించి పూర్తిగా వివరించారు. మొత్తం ఐదు భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లీష్‌లో చూడవచ్చు. ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ అవార్డుకు కూడా నామినేట్ కావడంతో పాటు ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు కూడా అందుకుంది.
ఇది కూడా చూడండి: నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు