ఒప్పో నుంచి కిక్కిచ్చే ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయ్ గురూ!

ఒప్పో కె 12 సిరీస్‌లో కె 12 ప్లస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇది గరిష్టంగా 12జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా, 6220 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు సమాచారం.

New Update
Oppo K12 Plus

దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరిగిపోయింది. కొత్త కొత్త ఫోన్లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఫోన్ ప్రియుల టేస్ట్‌కి తగ్గట్టుగా రిలీజై మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఫోన్లను లాంచ్ చేసి దూసుకుపోతున్నాయి. అందులో ఒప్పో ఒకటి. అతి తక్కువ సమయంలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాంచుకుంది. వరుస ఫోన్లను లాంచ్ చేసి అబ్బురపరచింది. ఇప్పుడు తన లైనప్‌లో ఉన్న మరో ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 

Oppo K12 Plus

తన తదుపరి Oppo K12 సిరీస్‌‌లో Oppo K12 Plus స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ కొత్త ఫోన్ తాజాగా గ్రీక్‌బెంచ్ సహా చైనా‌లోని రేడియో సర్టిఫికేషన్‌ ఫ్లాట్ ఫార్మ్‌లో గుర్తించబడింది. అదే సమయంలో దీని స్పెసిఫికేషన్లు కూడా లీక్ చేయబడ్డాయి. దాని బట్టి ఫోన్ డిజైన్ సిరీస్‌లోని ఇతర మోడల్ మాదిరిగానే ఉండబోతున్నట్లు లీక్ ద్వారా తెలిసింది. ఒప్పో కె12 సిరీస్‌ నుంచి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి లీకైన స్పెసిఫికేషన్లు తెలుసుకుందాం.

ఇదికూడా చదవండి: బంపరాఫర్.. రూ.5,299కే కర్వ్‌డ్ డిస్‌ప్లే ఫోన్, మరీ ఇంత చీపా..!

Oppo K12 Plus స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఫోన్ సేఫ్టీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడినట్లు తెలుస్తోంది. ఇక దీని వేరియంట్‌ల విషయానికొస్తే ఇది రెండు వేరియంట్‌లో వచ్చే అవకావం ఉంది. అందులో 8జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో రానున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాకుండా ఫోన్‌కు శక్తినిచ్చేందుకు ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,220 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 2.4GHz ఆక్టాకోర్ చిప్‌తో రానున్నట్లు చెప్పబడింది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే.. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం.

అలాగే కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను అందించే అవకాశం ఉంది. ఇక ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్ ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు