ప్రస్తుతం అందరూ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు వంటివి వాడుతున్నారు. ఈక్రమంలో కొందరు కొన్ని లింక్స్‌పై క్లిక్ చేయడం వల్ల డేటా హ్యాక్ అవుతుంది. ప్రస్తుతం నెక్రో ట్రోజన్ అనే వైరస్ ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. అన్‌అఫీషియల్‌గా ఉన్న యాప్స్, గేమ్స్ నుంచి ఈ వైరస్ ఫోన్‌లోకి వస్తుంది. కొందరు గూగుల్ ప్లే స్టోర్‌లో కాకుండా కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఈ యాప్స్ ద్వారా ఈ నెక్రో ట్రోజన్ వైరస్ మొబైల్‌లోకి వ్యాపిస్తుంది. మొబైల్‌లోకి ఈ వైరస్ ప్రవేశించిన తర్వాత మీకు తెలియకుండానే ఫోన్‌లోని డేటా, బ్యాంకు వివరాలు అన్ని హ్యాక్ చేసేస్తారు. దీంతో బ్యాంకు అకౌంట్‌లోని డబ్బులు పోతాయి.
గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే..
ఈ వైరస్ వల్ల మొబైల్ ఫోన్‌లో అన్‌వాంటెడ్ యాడ్స్ వస్తాయి. ఎక్కువగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఈ వైరస్ ప్రవేశిస్తుంది. వుటా కెమెరా, మ్యాక్స్ బ్రౌజర్ యాప్స్ మొబైల్ ఫోన్‌లో నెక్రో ట్రోజన్ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయి. ఈ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. యాప్స్ ఏవైనా కేవలం గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ నుంచి డౌన్‌లోడ్ చేస్తే డేటా హ్యాక్ కావడం, అన్‌వాంటేడ్ యాడ్స్ వంటివి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. స్పాటిఫై, మైన్‌క్రాఫ్ట్ వంటి యాప్‌ల ద్వారా ఈ వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. కాబట్టి తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు.