ఇప్పుడంతా పండుగ సీజన్ మొదలైపోయింది. మొన్నటికి మొన్ననే దసర పండుగ అయింది. మరికొద్ది రోజుల్లో దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు రానున్నాయి. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కొత్త వెహికల్స్ రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని కంపెనీలు తమ వాహనాల సేల్స్ పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించి ఆకట్టుకుంటున్నాయి.
ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
ఇప్పటికే చాలా కంపెనీలు తమ వెహికల్స్‌పై ఊహించని డిస్కౌంట్లను ప్రకటించాయి. తాజాగా మరో కంపెనీ తన వాహనాలపై తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది. వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ కంపెనీ తన జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, జాయ్ ఈ-రిక్ త్రీ వీలర్లపై తగ్గింపు ఆఫర్లు ఇస్తుంది. అందులో జాయ్ ఈ-బైక్ మిహూస్‌పై రూ.30,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు.
ఇది కూడా చదవండి: డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు.. ఆన్‌డ్యూటీ మరో ఏడాది పొడిగింపు
రూ.70,000 ధరతో ప్రారంభం
దీని ప్రస్తుత ధర రూ.1,17 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. అంతేకాకుండా వోల్ఫ్, వోల్ఫ్ ఎకో, గ్లోబ్, జెన్ నెక్స్ట్ నాను, వోల్ఫ్ ప్లస్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను సైతం ఈ కంపెనీ విక్రయిస్తోంది. అయితే ఇవి రూ.70,000 (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభమవుతాయి. అయితే ఇప్పుడు ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ అందించడానికి వార్డ్‌విజార్డ్ బ్లూబెల్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి పనిచేస్తోంది.
ఇది కూడా చూడండి: సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్
నవంబర్ వరకే ఆఫర్లు
అంతేకాకుండా తమ వాహనాలు కొనుగోలును మరింత ఈజీ చేసేందుకు మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎంఐఎఫ్ఎల్) తో సహా 15 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా సులభమైన ఫైనాన్సింగ్ ఎంపిక పొందొచ్చు. ఈ ఆఫర్లన్నీ డీలర్‌షిప్స్, డిస్ట్రిబ్యూటర్లతో సహా ఆన్‌లైన్ ప్లాట్ ఫార్మ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు 2024 నవంబర్ వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కి.మీ మైలేజీ
కాగా జాయ్ ఈ-బైక్ మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 130 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ సింగిల్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. అలాగే ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, జీపీఎస్ ట్రాకింగ్, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమోట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.