iPhone 16: ఐఫోన్ 16 సీరీస్ ఫోన్లు వచ్చేశాయి.. అదిరిపోయే ఫీచర్లు ఇవే!

ఐఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16 సీరీస్ ఫోన్లను విడుదల చేసింది యాపిల్ కంపెనీ. ఇట్స్ గ్లో టైమ్ అనే పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4ను లాంఛ్‌ చేసింది.

author-image
By Nikhil
iphone 16
New Update

iPhone 16: ఐఫోన్ లవర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న 16 సీరీస్ వచ్చేసింది. కాలిఫోర్నియాలో ఇట్స్ గ్లో టైమ్ అనే ఈ వెంట్‌లో అట్టహాసంగా ఐఫోన్ 16 సీరీస్ ఫోన్లతో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, ఎయిర్‌పాడ్స్‌ 4ను లాంఛ్‌ చేసింది యాపిల్. కొత్త సీరీస్‌లో యాపిల్ ఇంటిలిజెన్స్‌ను పరిచయం చేసింది. దాంతో పాటూ టచ్‌ సెన్సిటివ్‌ కెమెరా, యాక్షన్‌ బటన్‌ ఇచ్చారు. ఇది కెమెరా యాప్‌ షార్ట్‌కట్‌ కీగా పనిచేయనుంది. కొత్త సీరీస్‌ నుంచి ఎప్పటిలానే ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ఫ్రో, ఇంకా ప్రో మాక్స్‌లను విడుదల చేసింది కంపెనీ. దాంతో పాటూ యాపిల్ అల్ట్రా వాచ్ కొత్త సీరీస్‌లు, ఐపాడ్స్‌ను కూడా రిలీజ్ చేసింది.

ఐఫోన్ 16 మోడల్స్ అన్నీ ఐఓఎస్ 18 సాఫ్ట్‌వేర్‌‌తో రావడమే కాక అన్ని ఫోన్లూ యాక్షన్ బటన్ కలిగి ఉంటాయి. ఇక ఐఫోన్ 16..6.1, 16 ప్లస్‌.. 6.7, 16 ప్రో.6.3, ప్రోమ్యాక్స్‌.. 6.9 అగుళాలను కలిగి ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే..: ఐఫోన్ 16 3561mAh, ఐఫోన్ 16 Plus: 4006mAh, 16 Pro: 3355mAh, 16 Pro Max: 4676mAh బ్యారీలతో వస్తున్నాయి. ఇక దీనికి కూడా యూఎస్‌బీ టైప్ సీ ఛార్జర్‌‌నే ఇవ్వనుందని తెలుస్తోంది.

డిస్‌ప్లే ఫీచర్లు:

ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 16, 16 ప్లస్‌లు 2x ఆప్టికల్ జూమ్‌తో 12MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉండగా. ప్రో సిరీస్ 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు A18 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయని చెబుతున్నారు. అయితే బేస్ వేరియంట్‌లు మాత్రం A17 చిప్‌సెట్‌తో రావచ్చు.

ధరలు…

ఇక ధరల విషయానికి వస్తే బేసిక్ ఐఫోన్ 16 ధర 799 డాలర్లు అంటే 67,100 ఇండియన్ రూపాయలుగా ఉండనుంది. అలాగే 16 ప్లస్ 899 డాలర్లు అంటే రూ.75,500..16 ప్రో 1,099 డాలర్లు అంటే రూ.92,300…16 ప్రో మ్యాక్స్ 1,199 అంటే రూ. 99, 517 గానూ ఉండనుంది.

#iphone-16
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe