ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసికంలో లాభాలను పొందింది. ఏకంగా రూ.6,506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది. గతేడాదితో రూ.6,212 కోట్ల లాభం పొందిన ఇన్ఫోసిస్ ఈ ఏడాది 4.7% అధికంగా లాభాలను పొందింది. వీటితో పాటు కార్యకలాపాల ఆదాయం రూ.38,994 కోట్ల ఉండగా.. 5.1% పెరిగి రూ.40,986 కోట్లకు చేరింది. కంపెనీలోని పెద్ద ఒప్పందాల విలువ 2.4 బిలియన్ డాలర్లు. అయితే బోర్డులో ఉన్న ఒక్కో షేర్‌కు మధ్యంతర డివిడెండు కంపెనీ ప్రకటించింది.
ఇది కూడా చూడండి: Ap: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్...ఎవరూ చేశారో తెలుసా!
ఒక్కో డివిడెండు షేర్..
ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 16.7 శాతం పెరిగిందని, అక్టోబరు 29 వరకు రికార్డు చేసుకోగా నవంబరు 8లోగా చెల్లించాలని కంపెనీ తెలిపింది. ఏప్రిల్‌లో జరిగిన ఇన్ఫోసిస్ సమావేశంలో ఫిబ్రవరి 2025 నుంచి ఫిబ్రవరి 2029 వరకు వచ్చే 5 సంవత్సరాలకు దాని మూలధన కేటాయింపు విధానాన్ని సమీక్షించింది.
ఇది కూడా చూడండి: Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..మరో నాలుగు రోజులు వర్షాలు!
ఈ ఐదేళ్లలో సెమీ వార్షిక డివిడెండ్‌లు, ప్రత్యేక డివిడెండ్‌లు, షేర్ బైబ్యాక్‌ల కలయిక ద్వారా 5 సంవత్సరాల సమయంలో సుమారుగా 85 శాతం ఉచిత నగదును తిరిగి ఇచ్చే విధానంలో కొనసాగించాలని సూచిస్తోంది. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల రతన్ టాటాకు నివాళి అర్పించారు. ఆ తర్వాత 2001లో ఇన్ఫీ క్యాంపస్‌ను, రతన్ సందర్శించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూనే వస్తుంది.
ఇది కూడా చూడండి: Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత
సెప్టెంబరలో 2,500 కొత్తవారిని కంపెనీ తీసుకుంది. దీంతో త్రైమాసికంలో 12.7% నుంచి 12.9 శాతానికి కొత్త ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలో కూడా 15,000-20,000 మంది తాజాగా ఉత్తీర్ణులు అయిన వారిని నియమించుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే గతంలో ఆఫర్ లెటర్లు పొంది జాయిన్ చేసుకుని వారిని కూడా తీసుకుంటామని తెలిపింది.
ఇది కూడా చూడండి: Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్