Indian Stock Market:
ఇండియా స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. గత కొన్ని రోజులుగా జీవిత కాల గరిష్టాలను నమోదు చేస్తూ కొత్త రికార్డ్‌లను సృష్టిస్తోంది. ఈరోజు వారం ప్రారంభం..సోమవారం, ఉదయం నుంచి మార్కెట్ దూకుడును ప్రదర్శించింది అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం లాభాలనే నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడి 84, 928 దగ్గర ముగియగా.. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 25, 939 దగ్గర ముగిసింది. ఇదే పరిస్థితి రోజంతా కొనసాగింది. ఇక ముగింపులో ముగింపులో సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడి 84, 928 దగ్గర ముగియగా.. నిఫ్టీ 148 పాయింట్లు లాభపడి 25, 939 దగ్గర ఎండ్ అయింది. అయితే గరిష్టాల దగ్గర సూచీలు కాస్త అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు ఇంట్రాడేలో 84,980.53 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 339.19 పాయింట్ల లాభంతో 84,883.50 వద్ద ముగిసింది. డారుతో రూపాయి మారకం విలువ 83.55గా స్థిరపడింది.
ఈరోజు వోడాఫోన్ షేర్లు బాగా రాణించాయి. 4జీ-5జీ నెట్‌వర్క్ పరికరాల కోసం నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్ కంపెనీలకు రూ.30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చిన నేపథ్యంలో ఈ షేర్లు అమాంతం పెరిగాయి. ఇక సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. సెక్టార్లలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ పెరిగింది. రియల్టీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. మరోవైపు ఆటో, ఇంధనం, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, మీడియా 0.5-1 శాతం పెరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించింది.