Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు! బంగారం ధరలు రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. By Bhavana 24 Sep 2024 | నవీకరించబడింది పై 24 Sep 2024 14:33 IST in బిజినెస్ హైదరాబాద్ New Update షేర్ చేయండి Gold Rates Today : బంగారం ధరలు రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతున్నాయి. ఇది వరకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న సంకేతాలతో భారీగా పెరిగిన బంగారం ధరలు...తర్వాత ఊహించిన దానికి మించి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించగా.. ఇంకా గోల్డ్ ధరలు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. దీంతో.. అక్కడి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న సంకేతాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గుతోంది. దీంతో బంగారం ధరలు పెరుగుతుంటాయి. దేశీయంగా చూసుకుంటే బంగారం రేట్లు ఒకే దిశలో పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ. 220 ఎగబాకి రూ. 76,150 కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 200 పెరగడంతో తులం రూ. 69,950 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 76,300 పలుకుతోంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి రేట్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు ఇక్కడ ధరల్లో మార్పు లేదు. ఢిల్లీలో ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ. 93 వేల వద్ద ఉంది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో రూ. 2 వేల మేర పెరిగింది. హైదరాబాద్ నగరంలో చూస్తే.. కేజీ సిల్వర్ రేటు రూ. 98 వేల వద్ద స్థిరంగా ఉంది. Also Read : నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఏపీ సర్కార్ #gold-rates #gold-rate-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి