Gold and silver Rates:
బంగారం, వెండి ఈ రోజు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) గణాంకాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.452 పెరిగి రూ.78,703కి చేరుకుంది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం ధర రూ.441 లాభంతో రూ.78,692 దగ్గర ఉంది.
అదే సమయంలో వెండి ధర కూడా రూ.779 పెరిగి కిలో ధర రూ.99,151కి చేరింది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి వెండి ధర రూ.490 పెరిగి రూ.98,862కి చేరుకుంది. అంతకుముందు అక్టోబర్ 22న కూడా బంగారం, వెండి ఆల్ టైమ్ గరష్టాలను నమోదు చేసుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు బంగారం ధర రూ.3,506 పెరిగింది. సెప్టెంబర్ 30న రూ.75,197గా ఉంది.
ఈ ఏడాది జనవరిలో ఓన్సు బంగారం ధర 2000 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ధర దాదాపు 7 శాతం మేర పతనమైంది. దాంతో బంగారం ధర చాలా మేర తగ్గింది. కానీ తగ్గినట్లే తగ్గిన బంగారం ధర మళ్లీ రెక్కలు విప్పుకుని పరుగెట్టింది. ఓ వైపు పండగలు, పెళ్లిళ్లు.. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు తోడవ్వడంతో బంగారం, వెండికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈరోజు బంగారం రికార్డ్ స్థాయి గరిష్టానికి చేరుకుంది.
Also Read: AP: ముంచుకొస్తున్న దానా తుఫాన్..రైళ్లు రద్దు, పరీక్షలు వాయిదా