Gold Prices: సోమవారం దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారం 22క్యారెట్లు ధర రూ. 10 తగ్గి.. రూ. 69,590కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,600గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్లు బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,95,900గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,959 వద్ద స్థిరంగా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 75,920గా ఉంది. క్రితం రోజు ఈ ధర రూ. 75,930గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,59,200గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,592 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. .
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 69,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,920గా ఉన్నట్లు సమాచారం. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 75,970 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 69,590గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,920గా ఉంది.
వెండి కూడా.. దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,290గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93,000గా ఉంది. ఆదివారం ఈ ధర రూ. 92,900గా కొనసాగింది. కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 97,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 92,900.. బెంగళూరులో రూ. 90,900 వద్ద కొనసాగుతున్నాయి.
Also Read : మమ్మల్ని క్షమించండి.. అభిమానులకు తారక్ సారీ!