Gold Price: లక్షకు చేరువలో వెండి ధర..బంగారం రేటు ఎలా ఉందంటే!

దేశంలో పసిడి, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాాబాద్​లో వెండి ధర రూ. 1 లక్షకు చేరువైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,88,600కి చేరింది.

Gold and Silver: బంగారం ధరలు దిగి వస్తున్నాయి..వెండి ధర భారీగా పడిపోయింది..ఈరోజు ఎంతుందంటే.. 
New Update

Gold Prices: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి...రూ. 68,860 కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 68,850గా ఉండేది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,88,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,886గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం  ధర రూ. 10 పెరిగి.. రూ. 75,120కి చేరింది. శుక్రవారం.. ఈ ధర రూ. 75,110గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,51,200గా ఉంది. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం రేట్లు శనివారం ముందుకు కదిలాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 60,010గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,270గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,860 పలుకుతోంది. 

24 క్యారెట్ల గోల్డ్​.. 75,120గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,860గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,120గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,860గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 75,120గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,860గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,120గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,910గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 75,170గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,860గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,120గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చు తగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,260గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 92,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 92,500గా ఉంది.

 కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 97,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 92,600.. చెన్నైలో రూ. 97,600గా కొనసాగుతుంది.

#gold-rate-in-hyderabad #gold-price-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి