దీపావళికి షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!

దీపావళి పండుగకి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నట్లయితే తప్పకుండా జాగ్రత్త వహించండి. ఆన్‌లైన్‌లో ఫేక్ లింక్‌లు, ఫార్వార్డ్ లింక్‌లపై క్లిక్ చేయడం వంటివి చేస్తే అకౌంట్లలోని డబ్బు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా? జర జాగ్రత్త..
New Update

పండుగ వస్తుంటే చాలు.. అందరూ కూడా షాపింగ్ మొదలుపెడతారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే కొత్త దుస్తులు, మ్యాచింగ్ బ్లౌజ్, బ్యాంగిల్స్ ఇలా ఒకటేంటి.. అన్ని కొంటారు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో షాప్‌కి వెళ్లి కొనే వాళ్లకంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునే వారు ఎక్కువగా ఉన్నారు. ఆన్‌లైన్ షాపింగ్ అధికమవుతున్న క్రమంలో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. దీపావళి పండగకి కొత్త దుస్తులు, వస్తువులు కొనాలనే ఆలోచనలో తెలియక కొందరు షాపింగ్ చేసేటప్పుుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల మోసపోయే ప్రమాదం ఉంది. మరి దీపావళి పండగకి షాపింగ్ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త!

క్లిక్ చేశారో అంతే సంగతులు..

పండుగను దృష్టిలో పెట్టుకుని షాపింగ్ చేస్తారని తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ డబ్బులకే బట్టలు, మ్యాచింగ్ ఇలా ఆఫర్లలో ఉన్నాయని లింక్‌లు పంపిస్తుంటారు. వీటిని క్లిక్ చేసి తక్కువ ఖర్చుతోనే షాపింగ్ చేయవచ్చని టెంప్ట్ చేస్తారు. దీంతో ఆ లింక్‌పై క్లిక్ చేశారో అనుకోండి.. అకౌంట్లలోని డబ్బులు అంతా గోవిందా అయిపోతాయి. 

ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ

కాబట్టి నమ్మదగిన సైట్‌లో మాత్రమే షాపింగ్ చేయండి. ఏదైనా సైట్ లేదా లింక్ ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఫార్వార్డెడ్ మెసేజ్‌లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ లింక్‌ను షేర్ చేస్తే గిఫ్ట్స్, డబ్బులు వస్తాయంటూ కొందరు షేర్ చేస్తారు. ఇలాంటి లింక్స్ వస్తే అసలు ఓపెన్ చేయవద్దు. ఒక్కసారి ఈ లింక్ ఓపెన్ చేస్తే.. అకౌంట్లోని డబ్బులు క్షణాల్లో ఖాళీ అయిపోతాయి. 

ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

 ఒరిజినల్ సైట్లు ఎలా ఉంటాయో.. ఫేక్ సైట్‌లను కూడా అలాగే పోలి ఉంటాయి. పొరపాటున మీరు ఫేక్ సైట్‌లో షాపింగ్ చేస్తే మీ వస్తువులు తిరిగి రాకపోవడంతో పాటు బ్యాంక్ ఖాతాల్లో ఉండే డబ్బు కూడా ఖాళీ అవుతుంది. కాబట్టి పండగకి షాపింగ్ చేసే ముందు ఆలోచించి జాగ్రత్తగా చేయండి.  

ఇది కూడా చూడండి:  పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు

#online-shopping-scam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe