Business: పనికిరాని పెంకులతో లక్షల్లో ఆదాయం

ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలు పొందొచ్చు.

Coconut shells
New Update

Business: కాదేది వ్యాపారానికి అనర్హం అనేది వందశాతం నిజం. మారుతోన్న అవసరాలకు అనుగుణంగా రకకరాల మార్గాల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు చాలామంది. ఒకప్పటిలా ఊస పద్ధతిలో కాకుండా ఇప్పుడు విభిన్నమైన మార్గాలను వెతుక్కుంటున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కొబ్బరి బొగ్గును బ్యూటీ ప్రొడక్ట్స్‌:

మార్కెట్లో ప్రస్తుతం కొబ్బరి బొగ్గుకు బాగా డిమాండ్ ఉంది. కొబ్బరి బొగ్గుతో భారీగా లాభాలు ఆర్జింవచ్చు. ఇంతకీ ఏంటీ కొబ్బరి బొగ్గు వ్యాపారం.. లాభాలు ఎలా  ఉంటాయనే  సందేహం అందరికీ వస్తుంటుంది. కొబ్బరి బొగ్గును బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌ ప్యాక్‌లు, కాస్మోటిక్స్‌, సబ్సు, స్పేర్ పార్టుల తయారీ, యుద్ధ పరికరాలు, గ్యాస్‌ మాస్కుల వంటి తయారీలో ఈ బొగ్గును ఉపయోగిస్తున్నారు. నీటిలోని క్లోరిన్, వైరస్, బ్యాక్టీరియాలను తరిమికొట్టడంలో కొబ్బరి బొగ్గు సమర్థవంతంగా పనిచేస్తుంది.
 
ఈ వ్యాపారాన్ని ప్రారంభఙంచాలంటే కొంత స్థలం ఉంటే చాలు. తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. బొగ్గు పెంకులను కొనుగోలు చేసి ఒక కమిషన్‌లో వాటిని కాల్చాలి. కానీ దీనికి మిషన్‌ అవసరం లేదు. సాధారణ మంటపై కూడా బొగ్గు పెంకులను బాగా కల్చి వాటిని పొడిగా మార్చాలి. తర్వాత వాటిని ప్యాకింగ్ చేసి విక్రయించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా బొగ్గు పొడిని విక్రయిస్తున్నారు. పెద్దపెద్ద కంపెనీల నుంచి ఆర్డర్‌లు తీసుకొని మంచి లాభాలు ఆర్జించవచ్చు. కొబ్బరి పెంకులతో తయారు చేసిన బొగ్గు ప్రస్తుతం కిలో రూ.50 నుంచి రూ.75 పలుకుతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ డిమాండ్ ఉండే ఈ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందొచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

ఇది కూడా చదవండి: భూమిలోకి బంగారం ఎలా వస్తుంది?..సూర్యుడిపై చాలా బంగారం ఉందా?

#business
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe