Business: కార్మికులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. కనీస వేతనం పెంపు

ద్రవ్యోల్బణం పెరుగుదలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచింది. అసంఘటిత రంగాలలో సవరించిన వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్. నైపుణ్యం లేని కార్మికుల కనీస రోజువారీ వేతనం రూ.783కి పెంచారు. సెమీ స్కిల్డ్ కార్మికుల దినసరి వేతనం రూ.868కి, ఆర్టిజన్లకు రూ.1,035కు పెంచారు. 

New Update
Business..1

Business: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలను పెంచింది. నైపుణ్యం లేని కార్మికుల కనీస వేతనం రూ.783కి పెంచారు. వారానికి ఒక సెలవును పరిగణనలోకి తీసుకుంటే నెలకు రూ.20,358 కనీస వేతనం అవుతుంది. సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస రోజువారీ వేతనం రూ.868కి పెంచారు. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు రోజువారి వేతనం రూ.1,035కు పెంచారు.  రోజువారీ వేతనం నెలకు రూ.20 వేల 358 నుంచి 26 వేల 910 వరకు ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఎ గ్రేడ్ ఏరియాల్లో పనిచేసే వారికి ఇది రేట్ రివిజన్. 

కనీస రోజువారీ వేతనం కూడా సంవత్సరానికి రెండుసార్లు కనీస వేతనం రూపంలో సవరించబడుతుంది. కొత్త రేట్లు అక్టోబర్ 1న ప్రకటించనున్నారు. పారిశ్రామిక కార్మిక ద్రవ్యోల్బణం ఆరు నెలల సగటు ఆధారంగా కార్మికుల కనీస వేతనాలు పెంచనున్నారు. ఆరు నెలల్లో వినియోగదారుల ధరల సూచీ 2.40 శాతం పెరిగింది. ఈ ధరల పెరుగుదల కారణంగా జీవన వ్యయం కూడా పెరిగింది. దీన్ని భర్తీ చేసేందుకు కార్మికులకు వేరియబుల్ డీఏను పెంచారు. నిర్మాణం, మైనింగ్, వ్యవసాయం అసంఘటిత రంగాల జాబితాలో ఉన్నాయి. అలాగే నిర్మాణ కార్మికులు, చెత్త స్వీపర్లు, క్లీనర్లు, లోడింగ్, అన్‌లోడింగ్ కార్మికులు నైపుణ్యం లేని ఉద్యోగుల కిందకు వస్తారు. సెమీ-స్కిల్డ్ ఉద్యోగాల్లో హోటల్ సర్వర్, ట్రక్ డ్రైవర్, ఫైల్‌క్లర్క్, నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎలక్ట్రికల్, ప్లంబర్లు, మెషిన్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్లు వస్తారని కేంద్రం చెబుతోంది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు