భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. దేశంలో సెట్ టాప్ బాక్స్ లేకుండా మొదటిసారిగా ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవలను ప్రారంభించింది. మొదటిగా ఈ సేవలు మధ్యప్రదేశ్, తమిళనాడులో ప్రారంభించనున్నారు. త్వరలో దేశమంతటా కూడా విస్తరించనున్నారు. అయితే ఇది బీఎస్‌ఎన్‌ఎల్ ఐఎఫ్‌టీవీ ఇంటర్నెట్ డేటా ప్లాన్‌తో సంబంధం లేకుండా పనిచేస్తుందని తెలిపింది.
ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!
క్వాలిటీతో దాదాపుగా 500కి పైగా..
బీఎస్‌ఎన్‌ఎల్ ఐఎఫ్‌టీవీ ఇంటర్నెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ టీవీల్లో మాత్రమే పనిచేస్తుంది. ఎఫ్‌టీటీహెచ్ సబ్‌స్క్రైబర్‌లు ప్రత్యేక సెట్ టాప్ బాక్స్ వంటివి లేకుండా టీవీ ఛానెల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తుంది. క్వాలిటీతో 500కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌ను చూసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
ఇదిలా ఉండగా జియో, ఎయిర్‌టెల్ సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. మిగతా వాటితో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ధరలు తక్కువగానే ఉన్నాయి. మంత్లీ ప్లాన్స్, ఇయర్లీ ప్లాన్స్ ఇలా కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌కి యూజర్లు పెరిగారు. అయితే దేశంలో చాలా ప్రదేశాల్లో నెట్‌వర్క్ సరిగ్గా రాదు.
ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!
ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అసలు 4జీ నెట్‌వర్క్ కూడా లేదు. దీంతో దేశంలో 4జీ, 5జీ సేవలను విస్తృత పరచాలని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దేశమంతటా వైఫే రోమింగ్ సేవను కూడా ప్రారంభించింది. ఇంకా వినియోగదారులకు ఈజీగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందాలనే ఉద్దేశంతో ఈ ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టీవీ సేవలను దేశమంతా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చూడండి: ఖమ్మంలో దారుణం.. 20 ముక్కలుగా మహిళను కట్ చేసి ఏం చేశాడంటే?