Amazon Great Indian Festival: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్..మొబైల్, టీవీలపై భారీ డిస్కౌంట్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, కెమెరాలు, హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్‌, స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

New Update
amazon grate deal sale

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ప్రతి ఏడాది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి ఈ సేల్ మొదలు కానుంది. ప్రైమ్ మెంబర్స్‌ అయితే ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26న కొనుగోలు చేసుకోవచ్చు. ఈ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా కీబోర్డు, మౌస్‌లపై 82 శాతం, సార్ట్‌ వాచ్‌లపై 83 శాతం, స్పీకర్లపై 73 శాతం, యాక్షన్ కెమెరాలపై 53 శాతం, హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్‌పై 86 శాతం తగ్గింపు ధరలను ప్రకటించింది. 

మొబైల్స్‌పై డిస్కౌంట్

అమెజాన్ బిగ్గెస్ట్ సేల్‌లో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. వన్ ప్లస్, పోకో, శామ్‌సంగ్, రెడ్‌మీ, ఐక్యూ, ఐఫోన్ మొబైల్స్‌పై దాదాపుగా 30 శాతం తగ్గింపు ఇవ్వనుంది. 

21 శాతం తగ్గింపుతో డెల్ ల్యాప్‌ట్యాప్‌లు

ఈ గ్రేట్ డీల్స్‌లో డెల్ కంపెనీ ల్యాప్‌టాప్‌లు 21 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. దీనితో పాటు యాపిల్ ఐ ప్యాడ్, గేమింగ్ ల్యాప్‌ట్యాప్, లెనోవా వంటివి తక్కువ ధరకే లభిస్తాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు