Stock Markets: 11 లక్షల కోట్లు ఉఫ్..భారీ నష్టాల్లో సూచీలు

పశ్చిమాసియాలో యుద్ధం మొత్తం ప్రపంచ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ బులియన్ మార్కెట్ దీని కారణంగా కుదేలయిపోయింది. చివరకు 11 లక్షల కోట్ల భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 1750కి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25,250 స్థాయికి చేరింది.

New Update
stock

Stock Market Today: 

ఉదయం మార్కెట్ ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్‌ 1,264 పాయింట్లు పతనం కావడంతో ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 693 పాయింట్లు తగ్గింది. సెన్సెక్స్ 83,572 పాయింట్ల వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. నిఫ్టీ 211 పాయింట్లు తగ్గి 25,585 దగ్గర ట్రేడ్ అయింది. రోజు మొత్తంలో మార్కెట్‌లో సంవత్సరంలో నాల్గవ అతిపెద్ద క్షీణత కనిపించింది. స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.10.7 లక్షల కోట్లు తగ్గింది. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ఈరోజు రూ.465 లక్షల కోట్లుగా ఉంది. ఆటో, ఇంధనం, ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లలో మరింత క్షీణత కనిపించింది. బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించాయి. JSW స్టీల్ షేర్లు 1.33% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్‌గా ఉన్నాయి. 

రోజు ముగిసేసరికి సెన్సెక్స్ 1,769 పాయింట్లు (2.10%) క్షీణించి 82,497 వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ కూడా 546 పాయింట్లు (2.12%) క్షీణించింది, ఇది 25,250 స్థాయి వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.10.7 లక్షల కోట్లు తగ్గింది. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయం కారణంగా ప్రపంచ మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నడుస్తోంది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో మార్కెట్ ప్రస్తుత విలువలు పెరిగాయి. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో భారీ పెరుగుదల కనిపించింది. దీని కారణంగా, మార్కెట్లో గణనీయమైన మార్పులు జరిగాయి. అలాగే  అమెరికాలో మాంద్యం భయం పెరిగింది. దీని కారణంగా నిన్ అమెరికన్ మార్కెట్‌లో క్షీణత కనిపించింది. దీని ప్రభావం కూడా మన మార్కెట్ల మీద పడింది. ఇక ఆసియా మార్కెట్‌లో జపాన్‌కు చెందిన నిక్కీ 1.97% పెరిగింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 1.47% క్షీణించగా, కొరియా కోస్పీ సూచీ 1.22% క్షీణించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు