RBI: బ్యాంకులకు ఆర్బీఐ ఫైన్: నిబంధనల ఉల్లంఘనపై సీరియస్

బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్‌ఏ, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ లిమిటెడ్‌తో పాటు మరో ఐదు సహకార బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానాలు విధించింది. నిర్దేశిత నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ పెనాల్టీలు విధించినట్లు ఓ ప్రకటనలో ఆర్బీఐ పేర్కొన్నది.

New Update
RBI: బ్యాంకులకు ఆర్బీఐ ఫైన్: నిబంధనల ఉల్లంఘనపై సీరియస్

RBI: నిబంధనలు ఉల్లంఘనను సీరియస్ గా పరిగణిస్తున్న ఆర్బీఐ అలాంటి బ్యాంకులపై వరుసగా జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని బ్యాంకులపైనా అత్యున్నత బ్యాంకు జరిమానాలు విధించింది. నిర్దిష్ట నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్‌ఏ, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ లిమిటెడ్‌తో పాటు మరో ఐదు సహకార బ్యాంకులపై కూడా జరిమానాలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఎంత పెద్ద బ్యాంకైనా సరే, నిబంధనల ఉల్లంఘనను తేలికగా తీసుకునేది లేదనే సంకేతాలను దీని ద్వారా ఆర్బీఐ పంపించిందని ఆర్థిక వేత్తలు చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: ఒక వ్యక్తికి 9 సిమ్‎ల కన్నా ఎక్కువ ఉండొద్దు.. డిసెంబరు 1 నుంచి కొత్త రూల్స్

ఫెమా (FEMA), 1999 లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఆర్బీఐ సూచనల ఉల్లంఘన కారణంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఎన్ఏ పెనాల్టీకి గురయ్యాయి. కాగా, ప్రవాసుల నుంచి డిపాజిట్ల స్వీకరణపై ఆదేశాల ఉల్లంఘనకు గానూ హెచ్డీఎఫ్సీపై జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: ఆ స్థానాల్లో రీపోలింగ్.. వికాస్ రాజ్ క్లారిటీ!

అవేకాకుండా, వివిధ నియంత్రణ నిబంధనలను పాటించని ఐదు సహకార బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానాలు విధించింది. వాటిలో పాటలీపుత్ర సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, బీహార్; బాలాసోర్ భద్రక్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఒడిశా; ధృంగాధ్ర పీపుల్స్ కో ఆపరేటివ్ బ్యాంక్, గుజరాత్; పటాన్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, పటాన్, గుజరాత్; ది మండల్ నాగరిక్ సహకారి బ్యాంక్, గుజరాత్ ఉన్నాయి.

గత వారంలోనూ ఆర్‌బీఐ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు, ప్రైవేట్ రంగ బ్యాంకులు సిటీ బ్యాంకుకు కోట్లు జరిమానా విధించింది.

Advertisment
తాజా కథనాలు