/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-08T233405.699-jpg.webp)
Allu Arjun: సోషల్ మీడియాలో టాలీవుడ్ ఫ్యాన్స్ రెండుగా చీలిపోయి తీవ్రంగా డిబెట్లు చేస్తున్న సినిమా ‘యానిమల్’. తాజాగా ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తాడు బన్నీ. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాల లిస్ట్ లోకి ‘యానిమల్’ చేరిందంటూ చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తారు. డైరెక్టర్ సందీప్ మేకింగ్ స్టైల్, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ సినిమాను ఓ రేంజ్ లో నిలిపాయంటూ పొగడ్తలు కురిపించాడు.
ఇది కూడాచదవండి: నిన్న చరణ్..నేడు ఎన్టీఆర్..నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ!
‘‘యానిమల్ (Animal Movie) సినిమాను రూపొందించిన విధానం మైండ్ బ్లోయింగ్. టీమ్ అందరికీ అభినందనలు! రణ్‌బీర్ కపూర్.. మీ యాక్టింగ్ తో భారతీయ సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. మీ మ్యాజిక్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదు. రష్మిక.. నీ యాక్టింగ్ వండర్ఫుల్. ఇప్పటి వరకూ ఇదే నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బన్నీ. బాబీ దేవోల్ నటనకు ప్రేక్షకుల మాటరాలేదని, అనిల్ కపూర్ నటనలో డెప్త్ ఉందని చెప్పాడు. యంగ్ యాక్ట్రెస్ తృప్తి డిమ్రి ఇక ముందు ఇంతకుమించి రాణిస్తుందన్నాడు.
#Animal . Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations! #RanbirKapoor ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest…
— Allu Arjun (@alluarjun) December 8, 2023
ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ మూవీతో సినిమాటిక్ పరిమితులను చెరిపేసి అందరినీ గర్వపడేలా చేశాడని; అతడి చిత్రాలు భారత సినిమా దశను ఎలా మారుస్తాయో స్పష్టంగా కనిపిస్తోందని పోస్ట్ లో రాసుకొచ్చాడు అల్లూ అర్జున్.