Uttarakhand : హల్ద్వానీలో ఉద్రిక్తత పరిస్థితులు.. మసీదు, మదర్సా కూల్చివేత.. పోలీసుల పై రాళ్లు రువ్విన ప్రజలు!

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలోని మలికా బగీచా ప్రాంతంలో ఉన్న అక్రమ మదర్సా, మసీదు లను బుల్డోజర్ తో అధికారులు కూల్చివేశారు. దీంతో హల్ద్వానీలో భారీ అలజడి చెలరేగింది. మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులు అక్రమణలను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

New Update
Uttarakhand : హల్ద్వానీలో ఉద్రిక్తత పరిస్థితులు.. మసీదు, మదర్సా కూల్చివేత.. పోలీసుల పై రాళ్లు రువ్విన ప్రజలు!

Bulldozer Action : ఉత్తరాఖండ్(Uttarakhand) లోని హల్ద్వానీ(Haldwani) లోని మలికా బగీచా ప్రాంతంలో ఉన్న అక్రమ మదర్సా, మసీదు లను బుల్డోజర్(Bulldozer) తో అధికారులు కూల్చివేశారు. దీంతో హల్ద్వానీలో భారీ అలజడి చెలరేగింది. మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులు అక్రమణలను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ప్రజలు వీధుల్లోకి వచ్చి పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ప్రజలు పోలీసులు, పరిపాలన, మున్సిపల్ కార్పొరేషన్ బృందంపై కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎస్‌డీఎం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులతోపాటు పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి. అంతేకాకుండా జేసీబీ అద్దాలను కూడా ప్రజలు పగలగొట్టారు.

దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. దీంతో ఆ ప్రాంతంలో షూట్‌ అండ్ సైట్ ఆర్డర్‌ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హల్ద్వానీలో పోలీసులపై రాళ్ల దాడి

అక్రమ మదర్సాను కూల్చివేసిన తరువాత, ముస్లిం మహిళలు(Muslim Women's), యువకులు నిరసన వ్యక్తం చేశారు. నిర్వాహకులపై రాళ్లు రువ్వారు. ప్రజల నుండి ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో బంబుల్‌ పురా పోలీస్‌ స్టేషన్‌ వెలుపల ఉన్న చాలా వాహనాలకు నిప్పు పెట్టారు.

రాళ్లదాడిలో 10 మంది పోలీసులు, ఒక మహిళ గాయపడినట్లు సమాచారం. రాళ్లు రువ్విన తర్వాత పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసు బృందం టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించింది.

పోలీసులు లాఠీచార్జి

ఆ తర్వాత ఓ సముహం అనేక పోలీసు వాహనాలు, బస్సులకు నిప్పు పెట్టారు. మునిసిపల్ కార్పొరేషన్(Municipal Corporation) బృందం గురువారం మధ్యాహ్నం పోలీసులు, జేసీబీతో వన్‌భుల్‌పురా పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఈ వివాదం జరిగింది. అంతకుముందు, మాలిక్ గార్డెన్ ప్రాంతంలో ఆక్రమణతో నిర్మించిన మదర్సా, నమాజ్ స్థలాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

సంఘటనా స్థలానికి వచ్చే ప్రజలను అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకు దిగారు. కాసేపటికే రాళ్ల దాడి కూడా మొదలైంది.

Also read: యాపిల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. గ్యాలక్సీ జెడ్‌ ఫ్లిప్‌ డిజైన్‌ ఐఫోన్‌వచ్చేస్తుంది!

Advertisment
Advertisment
తాజా కథనాలు