Nehru : నవంబర్ 14, 1889లో పండిట్ జవహార్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru) ఓ కశ్మీరీ పండిట్ కుటుంబం (Kashmir Pandit Family) లో జన్మించారు. 1964 మే 27న అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి. ఆయన రాసిన పుస్తకాలు, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చేసిన కృషి ఇలాంటివి చాలామందికి తెలిసినవే. అయితే ఎక్కువమందికి తెలియని కథ బుధిని మంజియాన్‌ది.
గిరిజన మహిళ చేతుల మీదుగా పవర్ ప్లాంట్..
అది 1959 డిసెంబర్ 6. జార్ఖండ్ - ధన్‌బాద్ జిల్లాలో పంచెత్ డ్యామ్, హైడల్ పవర్ ప్లాంట్‌నుప్రారంభించడానికి నాటి ప్రధాని నెహ్రూ వచ్చారు. ఆయనకు జార్ఖండ్ (Jharkhand) లోని సంతాలి గిరిజన సమాజానికి చెందిన బుధిని మంజియాన్‌తో అనే అమ్మాయితో స్వాగతం పలకించాలని నిర్ణయించారు. ఈ ఆనకట్ట నిర్మాణ సమయంలో బుధిని కూలీగా పనిచేసింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు. సంప్రదాయ గిరిజన వస్త్రధారణ, ఆభరణాలతో అలంకరించిన బుధిని నెహ్రూకు స్వాగతం పలికి పూలమాల వేసింది.అటు బుధిని చేతుల మీదుగా బటన్ నొక్కి జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు నెహ్రూ. అయితే ప్రధాని సమక్షంలో తనకు లభించిన గౌరవం తన సొంత సమాజంలో తిరస్కారానికి, బహిష్కరణకు దారితీస్తుందని ఈ 15 ఏళ్ల బాలికకు ఆ సమయంలో తెలియలేదు.
Also Read : మరో మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త
పురుషుడికి పూలదండలు వేయకూడదు.
సంతాల్ గిరిజన సమాజంలో ఏ అమ్మాయి కూడా పురుషుడికి పూలదండలు వేయకూడదు. అలా చేస్తే అది వివాహం కిందకే వస్తుంది. అందుకే సంతాల్ సమాజం ఆమెను నెహ్రూ భార్యగా భావించింది. నెహ్రూ సంతాల్ గిరిజన సమాజానికి చెందిన వ్యక్తి కాబట్టి బుధినిను సమాజం నుంచి వేలివేశారు ఆ గిరిజన తెగ పెద్దలు. సంతాల్ గిరిజిన తెగ ఆందోళనల కారణంగా తర్వాత బుధిని తర్వాత ఉద్యోగం కూడా కోల్పోయారు. ఉపాధి కోసం బెంగాల్లోని పురూలియాకు వెళ్లిన బుధినికి సుధీర్ దత్తా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సుధీర్, ఆమె సహజీవనం చేశారు. వీరికి ఓ కుమార్తే కూడా ఉంది. అయితే 1985లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆమెకు మళ్లీ ఉపాధి అవకాశాన్ని కల్పించారు. అటు బుధిని 2023 నవంబర్ 17న అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు.
నెహ్రూ మరణం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 1962లో నెహ్రూ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభమైంది. ఆ ఏడాది ఆయన వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. 1963 వరకు ఆయన కశ్మీర్‌లో గడిపారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ వెళ్లిన నెహ్రూ చివరకు మే 26 1964లో ఢిల్లి (Delhi) కి రిటర్న్ వచ్చారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో బాత్‌రూమ్ నుంచి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే నెహ్రూకు వెన్నునొప్పి వచ్చింది. కొద్దిసేపు చికిత్స అందించిన వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. మే 27 1964 మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో ఆయన మరణాన్ని ప్రకటించారు.