ముద్రగడకు బుద్ధా రెండో కౌంటర్ లేఖ

కొద్దిరోజులుగా ఏపీలో బహిరంగ లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. ముద్రగడ మీది పొరపాటా లేక గ్రహపాటా? 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993-94లో ఎలా కలుస్తారు? 'ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా? అంటూ ముద్రగడకు బుద్ధా రెండో లేఖలో సెటైర్.

New Update
ముద్రగడకు బుద్ధా రెండో కౌంటర్ లేఖ

Buddhas second letter to Mudragada

ఏపీ రాజకీయాల్లో లేఖల విమర్శనాస్త్రాలు కొసాగుతున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాస్తుంటే..మరోపక్క టీడీపీ నేత బుద్ధా వెంకన్న ముద్రగడ లేఖలకు కౌంటర్ ఇస్తున్నారు. ముద్రగడ రాసే ప్రతీ లేఖలు సమాధానం ఇస్తామంటూ బుద్ధా వెంకన్న కొన్ని రోజుల క్రితం కౌంటర్ ఇచ్చిన సందర్భంగా తెలిపారు. ముద్రగడ దమ్ముంటే నాపై పోటీ చెయ్యి అంటూ మరోసారి పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతు లేఖ రాశారు. దీంతో బుద్దా వెంకన్న ఆయనకు మరోసారి బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించారు.

మీ పాలనలోనే కేసులే..

ఈ లేఖలో ముద్రగడ మీది పొరపాటా లేక గ్రహపాటా? 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993–1994లో ఎలా కలుస్తారు? ఈ లేఖ మీరు రాసిందా? లేక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిందా? అంటూ సెటైర్ వేశారు. 1993-94లో పత్తిపాడు ఎమ్మెల్యేగా మీరు, ముఖ్యమంత్రిగా కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి వున్నారు..మీరు చెప్తున్న కేసులు అప్పుడు మీరు శాసనసభ్యులుగా వున్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులే అని మరిచిపోయారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

బెదిరింపులకు భయపడను

అప్పటి విషయం చంద్రబాబుకి ఆపాదించడం పొరపాటు కాదా? మీరు ఈ లేఖలతో ఎందుకు జరగని విషయాలను జరిగినట్టు ప్రస్తావిస్తున్నారు? ఎందుకు మీరు చంద్రబాబుని ప్రతివిషయంలో లాగుతారు? అంటూ ప్రశ్నించారు. రాజకీయంగా ఏదన్నా మాట్లాడండి తప్పు లేదు.. కానీ చంద్రబాబుకి కులాన్ని ఆపాదించకండి.. ఆయన అన్ని కులాలని సమానంగా చూస్తారు అంటూ పేర్కొన్నారు.

పవన్‌ వర్సెస్ ముద్రగడ

ఇది ఇలా ఉంటే.. ఈరోజు ముద్రగడ పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండని పేర్కొన్నారు. ఇలా ఏపీ రాజకీయాల్లో లేఖలు కీలకంగా మారాయి. కొన్ని రోజుల క్రితం ముద్రగడి పవన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు