Minister Roja: మంత్రి రోజాకు షాక్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. అసలేమైందంటే?

మంత్రి బుడబుక్కల సంఘం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుడబుక్కల కులాన్ని కించపరిచేలా రోజా వాఖ్యలు చేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Minister Roja: మంత్రి రోజాకు షాక్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. అసలేమైందంటే?

ఏపీ మంత్రి రోజాకు (AP Minister Roja) బుడబుక్కల సంఘం నేతలు షాక్ ఇచ్చారు. నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుడబుక్కల కులాన్ని కించపరిచేలా రోజా వాఖ్యలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమ కులాన్ని కించపరిచే లా వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా పై చర్యలు తీసుకోవాలని నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఈ పిటిషన్ పై రోజా ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది.
ఇది కూడా చదవండి: Vijaysai Reddy: ‘సంకెళ్ల’ ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’..!!

కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా గారి అధ్యక్షతన నిర్వహించిన నిన్న పెడన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. నియోజకవర్గంలో అన్ని పభుత్వ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఈ సందర్భంగా రోజా అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: Amaravati: ఆ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. మంత్రి పెద్దిరెడ్డి కీలక ప్రకటన
ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా, నియోజకవర్గ అధికారులకు తెలిపి.. వాటిని పరిష్కరించాలని సూచించారు. ప్రతీ సమస్యను వీలైనంత త్వరగ పరిష్కరించాలని ఆదేవించారు. తద్వారా జగనన్నకు, జగనన్న ప్రభుత్వనికి మంచి పేరు తేవాలన్నారు.
Advertisment
Advertisment
తాజా కథనాలు