బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 48 రూపాయలతో నెలంతా రీఛార్జ్ తో పాటు డేటాను కూడా అందిస్తున్నట్లు వివరించింది. అతి తక్కువ ఖర్చుతో నెలంతా మొబైల్ సేవను కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుందని బీఎస్‌ఎన్ఎల్ యజామాన్యం వివరించింది.
ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్ లు ఒకదానిని మించి మరోకటి బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో పోటీని తట్టుకోని బీఎస్‌ఎన్‌ఎల్ రాణిస్తుందనే చెప్పవచ్చు. మిగిలిన నెట్ వర్క్‌లు అయినటువంటి జియో, రిలయన్స్, ఎయిర్‌టెల్, వోడాఫోన్ లు తమ వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటించి తమ వైపు ఆకర్షించుకుంటున్నాయి.
దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు తగ్గారనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా బీఎస్‌ఎన్‌ఎల్ కొన్ని అడుగులు ముందుకు వేసి తక్కువ ఖర్చుతో వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుందనే చెప్పుకోవచ్చు. కేవలం రూ. 50 లోపే తన వినియోగదారులకు నెల రోజుల పాటు కాలింగ్, డేటా ను అందించడానికి రెడీ అయ్యింది.
కాల్స్ చేసుకునేందుకు 10 రూపాయల టాక్ టైమ్ బ్యాలెన్స్ తో పాటు నిమిషానికి 20 పైసల చొప్పున ఇంటర్నెట్ ను అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తో పాటు నిర్ధిష్ట సర్కిల్స్ లో అందుబాటులో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also read: సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త.. హైదరాబాద్ నుంచి 20 స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!