KTR : 370 మందిని కాల్చి చంపింది మీరు కాదా? : కాంగ్రెస్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం!

తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? హైదరాబాద్ స్టేట్ కోసం పోరాటం చేస్తున్న విద్యార్ధులపై కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ తన 'X' ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపించారు.

KTR : రేవంత్ హయాంలో ఆ 3 కంపెనీలు పరార్ : కేటీఆర్
New Update

KTR Questions To Congress : జూన్ 2న తెలంగాణ (Telangana) రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్న వేళ.. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ గీతంపై ఇరు పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ పై 'X'లో ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ ఏమన్నారంటే..

''తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?

1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ (Hyderabad) స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

1971 పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరు ?''

దీంతో ఈ పోస్టు పై కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి.. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా

#brs #ktr #congress #telangana-movement
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe