Revanth : బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమలను (IT Industry) తీసుకువచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఐటీ హబ్ లు పెట్టామన్నారు. వరంగల్ (Warangal) కు తాము టెక్ మహీంద్రా లాంటి దిగ్గజ పరిశ్రమను తీసుకువస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అది పారిపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న పరిశ్రమలను కూడా కాపాడుకోలేని దుస్థితి ఈ ప్రభుత్వానికి ఉందన్నారు.
కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే లేదని తెలివి ఎలాగూ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల కార్నింగ్ అనే కంపెనీ చెన్నైకి, కీన్స్ టెక్నాలజీ గుజరాత్ కు వెళ్లిపోయిందని అన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ మూడు జిల్లాల్లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. పట్టభద్రులు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.
This browser does not support the video element.
Also Read : ఏసీపీ ఉమామహేశ్వర్ రావు అరెస్ట్