BRS Sunke Ravi Shankar: దళిత బంధు పథకంలో తాను 3 లక్షలు లంచం తీసుకున్నట్లు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం నిరూపిస్తే.. గంగాధర చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తల నరక్కుంటానని ఖరకండిగా చెప్పేశారు చొప్పదండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్. ఒకవేళ మేడిపల్లి సత్యం నిరూపించకపోతే సత్యమే తల నరక్కోవాలని అన్నారు.
Also Read: గుంతల ఆంధ్రప్రదేశ్‍కు దారేది.!
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో చొప్పదండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకే రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సుంకే రవి శంకర్ దళిత బంధు పథకంలో 3 లక్షలు లంచం తీసుకున్నాడంటూ మేడిపల్లి సత్యం ఒక పోస్టర్ విడుదల చేశాడన్నారు. తమ నాయకులకు, కార్యకర్తలకు చాలా సందర్భాల్లో చెప్పానాని దళిత బందు, మరే ఇతర పథకాలలో ఒక రూపాయి లంచం.. ఇచ్చిన.. తీసుకున్న జైలుకు పంపిస్తానని పలుమార్లు చెప్పానని అన్నారు.
Also read: తీరు మార్చుకోని టీడీపీ చింతమనేని..గొర్రెల కాపరిపై దాడి.!
మేడిపల్లి సత్యం గంగాధర చౌరస్తా కు రావాలని సవాల్ విసిరారు. తాను, దళిత బంధు పథకంలో 3 లక్షలు లంచం తీసుకున్నట్టు మేడిపల్లి సత్యం నిరూపిస్తే నేను అక్కడనే తలనరక్కుంటానని తేల్చి చెప్పారు. ఒకవేళ నిరూపించకపోతే సత్యమే అక్కడే తల నరక్కోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో గంగాధర సింగిల్ విండో సిస్టమ్ చైర్మన్ దూలం బాలగౌడ్, కరీంనగర్ జడ్పి కోఆప్షన్ మెంబెర్ శుక్రుద్దీన్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.