TG New Logo : చట్టప్రకారం రేవంత్ రాజముద్రను మార్చలేడు.. హైకోర్టులో బోయినపల్లి వినోద్ పిటిషన్

తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మార్పునకు వ్యతిరేకంగా తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. కేంద్రం ఒప్పుకోకుండా రాష్ట్ర చిహ్నం మార్పు సాధ్యం కాదన్నారు. తనకు ఉన్న హక్కును వినియోగించుకుని లోగో మారకుండా చేస్తానన్నారు.

Vinod Kumar:  తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి.. మాజీ ఎంపీ వినోద్ డిమాండ్
New Update

TS New Logo Postponed : రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని (Telangana State Emblem) మార్చలేడని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ (BRS) కీలక నేత బోయినపల్లి వినోద్ కుమార్ (Boianapalli Vinod Kumar) అన్నారు. కేంద్ర చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే రాజముద్ర మార్చే అవకాశం ఉంటుందన్నారు. జూన్ 2న ప్రకటన చేసినంత మాత్రాన అది అయ్యేది కాదు.. పొయ్యేది కాదన్నారు. తానే ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు చెప్పారు. తాను కాకతీయ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థిని అని అన్నారు. చట్టప్రకారం తనకు ఉన్న హక్కును ఉపయోగించుకుని లోగో మారకుండా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు వినోద్ కుమార్.

Also Read : తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా

#telangana #boianapalli-vinod-kumar #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe