KCR: వారికి సాయం చేయండి.. రేవంత్ సర్కార్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ తొలి ప్రకటన! ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. By Nikhil 25 Dec 2023 in తెలంగాణ నల్గొండ New Update షేర్ చేయండి నల్లగొండ జిల్లాలో ఈ రోజు జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. ఈ ప్రమాదాలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు. నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.… — BRS Party (@BRSparty) December 25, 2023 ఈ మేరకు కొద్ది సేపటి క్రితం కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఈ రోజు తొలిసారిగా ఆయన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రకటన విడుదల చేశారు. ఈ వార్త అప్డేట్ అవుతోంది.. #cm-revanth-reddy #cm-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి