ఈ నెల 27న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో (Singareni Elections) బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పష్టం చేశారు. సింగరేణి ఎన్నికల్లో ఆత్మసాక్షిగా ఓట్లేసి టీబీజీకేఎస్‌ను (TBGKS) గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ మేరకు కవిత ప్రకటన విడుదల చేశారు. టీజీబీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు. సింగరేణి హక్కులను సాధించింది ఈ సంస్థేనని అన్నారు కవిత. కేసీఆర్ సింగరేణిని కాపాడారన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ దశాబ్ధ ప్రగతిపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేతపత్రానికి కేటీఆర్ కౌంటర్
ఇదిలా ఉంటే.. సింగరేణి ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ అనుబంధ సంఘమైన TBGKSకు ముగ్గురు అగ్రనేతలు రాజీనామా చేశారు. సంఘం గౌరవాధ్యక్షురాలు కవితకు ఉమ్మడిగా లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో బి. వెంకట్రావ్-యూనియన్ అధ్యక్షుడు, మిర్యాల రాజిరెడ్డి-ప్రధాన కార్యదర్శి, కెంగర్ల మల్లయ్య-వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు అనూహ్యంగా రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.