తీహార్ జైలు నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాని తెలిపారు. తనను ఇబ్బంది పెట్టినవారిని వడ్డీతో సహా చెల్లిస్తానంటూ సవాల్ విసిరారు. గత ఐదునెలలగా కుటుంబానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు. అలాగే తనకు అండగా నిలబడిన బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read:క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయండి.. సీజనల్ వ్యాధులపై సీఎం రేవంత్ ఆదేశాలు!
తాను కేసీఆర్ బిడ్డనని.. తప్పు చేయకున్నా జైలుకు పంపించారని కవిత మండిపడ్డారు. తాను మొండిదాన్నని.. అనవసరంగా జగమొండిగా మార్చారంటూ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు రాత్రి కవిత, కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలోనే ఉండనున్నారు. బుధవారం వీళ్లు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
.