Harish Rao-KTR: ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు!

కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించి సందడి చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ డ్రైవ్ చేస్తుండగా.. హరీశ్ రావు పక్కనే కూర్చున్న ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

New Update
Harish Rao-KTR: ఒకే కారులో బావాబామ్మర్దుల జర్నీ.. వైరల్ గా హరీశ్, కేటీఆర్ ఫొటోలు!

బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు సాయంత్రం జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. మంత్రి కేటీఆర్ స్వయంగా కారు నడుపుతుండగా.. హరీశ్ ఆయన పక్కనే కూర్చున్నారు. ఈ ఫొటోలను హరీశ్‌ రావు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
ఇది కూడా చదవండి: TS Police: పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా 90 శాతం వరకు.. వివరాలివే!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యతను హరీశ్, కేటీఆర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ కు కాలు ఆపరేషన్ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ అన్నీ తామై పార్టీని నడిపిస్తున్నారు.

ఇటీవల జరగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ వీరిద్దరూ ప్రభుత్వంపై ఇచ్చిన కౌంటర్లు బీఆర్ఎస్ అభిమానుల్లో ఆనందం నింపింది. హరీశ్, కేటీఆర్ ను కృష్ణార్జునులు అంటూ నెట్టింట్లో పొగడ్తలు వెల్లువెత్తాయి. తాజాగా హరీశ్ రావు పోస్టు చేసిన ఈ ఫొటోలకు సైతం మరో సారి కృష్ణార్జునులు అంటూ కామెంట్లు పెడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వీరి అభిమానులు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు