Padi Kaushik Reddy: మంత్రి పొన్నంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

TG: మంత్రి పొన్నం ప్రభాకర్ హయాంలో ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు డబ్బులు ముడుతున్నాయని ఆరోపించారు.

New Update
Padi Kaushik Reddy: మంత్రి పొన్నంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

Padi Kaushik Reddy: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్టీపీసీ నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని అన్నారు. ఈ విషయంలో పొన్నం ప్రభాకర్‌తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాలు చేశారు.

రెట్టింపు పరిమాణంతో ఫ్లైయాష్ తరలిస్తూ ఓవర్ లోడ్‌తో లారీలు వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు రూ.50 లక్షలు ముడుతున్నాయని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకుంటే రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి ఫోన్‌తో లారీలను అధికారులు వదిలిపెట్టారని అన్నారు. మీ కేబినెట్ లో మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని ఆధారాలు చూపించిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు